ఆగస్టు 30న విడుదల కానున్న  ‘సాహో’  సినిమా కోసం ప్రచారాన్ని ఆ చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. గత రెండు సినిమాలు   ‘బాహుబలి-1’ , ‘బాహుబలి-2’  ప్రభాస్ కు అంతర్జాతీయ హోదా ని తీసుకొచ్చాయో మన అందరికి తెలిసిందే .  దీంతో  తదుపరి సినిమా ‘సాహో’ ను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .  ఈ నేపథ్యంలో ‘సాహో’ ప్రచారాన్ని ముమ్మారం చేశారు. ఈ సినిమాలో కొన్ని కీలక  సన్నివేశాలకు ముందు చేసే రిహార్సల్స్‌ వీడియోలు, ఫొటోలను విడుదల చేస్తూ ఫాన్ ను  మరింత గా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.


ప్రభాస్ బాక్సింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఒక సన్నివేశాన్ని ఎలా నటించాలో డైరెక్టర్ సూచనలు చేస్తున్న వీడియోను తాజాగా సోషల్ మీడియా  ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. బాక్సింగ్ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో డైరెక్టర్ సుజిత్ చెబుతున్న సూచనలను ప్రభాస్ శ్రద్ధగా వింటున్నారు. ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది . ఇలా మెల్లగా సాహో‌ కి సంబందించిన ఒకొక్కటి  బయటికి రావడం తో ప్రభాస్ ఫాన్స్  అభిమాన హీరోను చూసుకొని మురిసిపోతూ పండగ చేసుకుంటున్నారు . ఈసారి  ఈ సినిమా  ఎన్ని రికార్డ్లు తిరగ రాస్తుందో  వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: