రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ సాహో  అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన  మూడవ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. సోమవారం తో  అన్ని ఏరియాల్లో ఈ చిత్రం యొక్క థియేట్రికల్ బిసినెస్  పూర్తి అయ్యింది. అయితే ఒక్కో భాషలో  ఎంత బిజినెస్ చేసిందో తెలియాల్సి వుంది. కాగా బాహుబలి  తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.  దాంతో తను నటించే సినిమాలకోసం దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేమికులు.  ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సాహు ను కూడా యూనివర్సల్ సినిమాగా తెరకెక్కించారు.  ఇక ఇటీవల విడుదలైన సాహో  టీజర్ , వీడియో సాంగ్ లతో ఈ సినిమాఫై  అంచనాలు తార స్థాయికి చేరాయి.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్నా ఈ చిత్రం ఆగస్టు 30 ప్రపంచ వ్యాప్తంగా  అత్యంత భారీ స్థాయిలో విడుదలకానుంది ఈ చిత్రం. కాగా హిందీ లో ఈ చిత్రాన్ని టీ సిరీస్ విడుదల చేస్తుండగా ఓవర్సీస్ హక్కులను   ఫార్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఈ హక్కుల కోసం ఫార్ ఫిలిమ్స్  ఏకంగా 40కోట్లకు పైగా చెల్లించిందని సమాచారం.  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి  శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు లో ఆమె  కు ఇదే మొదటి చిత్రం.  'రన్ రాజా  రన్'  ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని  భారీ  బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.  నీల్ నితిన్ ముకేశ్ , అరుణ్ విజయ్ , మురళి శర్మ , వెన్నల కిషోర్  తదితరులు  ముఖ్య పాత్రల్లో  కనిపించనున్నారు.  ఇక ఈసినిమా 30న విడుదలకావడంతో ఆ రోజు విడుదలకావల్సిన కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.  దాంతో సాహో అన్ని ఏరియాల్లో సోలోగా విడుదలకానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: