శని ఆదివారాల్లో బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న కంటెస్టంట్స్ వచ్చి కాస్త సరదా సరదాగా నడిపించినా సోమవారం వచ్చింది అంటే చాలు హౌజ్ మెట్స్ తమ ఆట ప్రారంభించేస్తారు. ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియను మండే పెట్టడం వల్ల ఈరోజు నామినేట్ అయిన వారు.. చేసిన వారు ఇద్దరు గొడవలు పడటం గ్యారెంటీ.  


ఇక ఇదిలాఉంటే ఈరోజు జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌజ్ మెట్స్ తమకు నచ్చని.. తాము నామినేట్ చేయాలని అనుకున్న కంటెస్టంట్స్ మీద రెడ్ మార్క్ స్టాంప్ వేయాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో ఎవరు ఊహించని విధంగా పునర్నవిని అందరు టార్గెట్ చేశారు. అయితే దీనికి హర్ట్ అయిన పునర్నవి బిగ్ బాస్ కంటెస్టంట్స్ మీద కాస్త ఫైర్ అయ్యింది.


కావాలని తనని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇంట్లో నలుగురు ఒకవైపు మిగతా వారంతా ఒక వైపు అన్నటుగా ఉందని పునర్నవి వ్యక్తపరచింది. అయితే సెల్ఫ్ నామినేట్ అవగా బిగ్ బాస్ రూల్స్ అలా రూల్స్ కు విరుద్ధంగా సెల్ఫ్ నామినేట్ చేసుకోకూడదని అనడంతో ఫైన గా ఇద్దరిని నామినేట్ చేసింది.


మూడు వారాలు అవుతున్నా తన గురించి నెగటివ్ గా చెప్పడం కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యింది పునర్నవి. వరుణ్ సందేశ్ కెప్టెన్ కాబట్టి అతన్ని ఈ వారం నామినేట్ చేయొద్దని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇక మరోపక్క తమన్నాని అందరు నామినేట్ చేశారని ఆ కోపాన్నంతా చివరగా తనని నామినేట్ చేసిన రవి కృష్ణ మీద చూపించింది. అతని మీద పర్సనల్ ఎటాక్ తో దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది తమన్నా. హౌజ్ మెట్స్ కూడా తమన్నాని కంట్రోల్ చేయలేకపోవడం విశేషం. రవి మాత్రం తమన్నా మాట్లాడిన మాటలకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.     




మరింత సమాచారం తెలుసుకోండి: