తమన్నా అంటే తళుకు బెళుకున భామ. మిల్కీ బ్యూటీ. ఆమె గ్లామర్ కి తిరుగులేదు. లేటెస్ట్ గా ప్రభుదేవాతో అభినేత్రి 2 లో కూడా అదరగొట్టింది. చేతిలో పెద్దగా  తెలుగు సినిమాలు లేకపోయినా తమన్నా పాపులారిటీకి ఎక్కడా ఢోకా లేదు. ఆమె ఇపుడు మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీ తరువాత ఆమెను సీనియర్ హీరోలే ఆఫర్లు ఇస్తున్నారట. దాంతో ఆమె కోలీవుడ్ వైపు ద్రుష్టి పెట్టింది.


ఇదిలా ఉండగా తమన్నా ఇపుడు బిగ్ ట్రబుల్లో పడిందట. తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 3 లో తమన్నా  సింహాద్రి అనే ట్రాన్స్ జెండర్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటివరకూ ఓ సెక్షన్ కే పరిమితం అయినా కూడా ఇపుడు మాత్రం బిగ్ బాస్ పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది.


ఇక బిగ్ బాస్ లో తమన్నా  సింహాద్రి చేస్తున్న అల్లరి, ఆమె కామెంట్స్ తో నెటిజన్లు  తమన్నాను ఓ రేంజిలో ట్రోలింగ్ చేస్తున్నారుట. అయితే వారు సినీ నటి తమన్నాను టార్గెట్ చేసుకుని ట్రోల్ చేయడం విశేషం. దీంతో తమన్నాకు ఈ కొత్త ట్రబుల్ ఎక్కువైపోతోందట. నెటిజన్లు తమన్నా అంటూ డైరెక్ట్ గా అటాక్ చేయడం, ఇదేం పద్ధతి తమన్నా అంటూ హాట్ కామెంట్స్ చేయడంతో చాలా మంది సినీ నటి తమన్నాకు ఏం జరిగింది. ఆమె ఎందుకిలా చేస్తోందని చర్చించుకుంటున్నారు.


మొత్తానికి  తమన్నా  సింహాద్రి కారణంగా నెటిజన్ల ట్రోలింగ్ ని మిల్కీ బేబీ భరించాల్సి రావడమే అసలైన ట్రాజడీ. తన మానాన మూవీస్ చేసుకోవడం, గప్ చిప్ గా ఉండడమే తనకు తెలుసని, ఇదేంటని తమన్నా తీరిగ్గా  మదన పడుతోందంట. తాను ఎక్కడా కనీసం  గాసిప్పులకు కూడా చాన్స్ ఇవ్వనని, ఇపుడు చూస్తే పెద్ద ఎత్తున తన పేరు మీద ట్రోల్స్ రావడమేంటని ఆమె ఆరా తీస్తే బిగ్ బాస్ కధ బయటపడిందంట.


మరి మిల్కీ బేబీ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే తన పేరు మీద ఉన్న ట్రాన్స్ జెండర్ బిగ్ బాస్ లో ఉన్నారు. ఆమెను తమన్నా అంటూ నెటిజన్లు లాగి మరీ ట్రోల్స్ చేయడంతో తన ఇమేజ్ కి ఇబ్బంది అయినా తప్పదని డిసైడ్ అయిపోయిందట. మొత్తానికి చూసుకుంటే తమన్నా  సింహాద్రి బిగ్ బాస్ లో కంటెస్టెంట్లను ఓ ఆట ఆడించడమే కాదు, బయట కూడా మిల్కీ బేబీని షేక్ చేసేస్తోంది. ఇద్దరి పేర్లు ఒక్కటి కావడంతో తమన్నా అంటేనే ఇపుడు సోషల్ మీడియ వూగిపోతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: