త‌మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌స్తుతం  కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో బందోబ‌స్త్ టైటిల్‌తో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో సాయేషా సైగల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్‌ మోహన్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్నిలైకా ప్రొడక్షన్స్ నిర్విస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ఫ‌స్ట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. త‌మిళంలో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 


ఈ సినిమాను మొద‌ట ఆగ‌ష్టు 30న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే సాహో ఆగ‌ష్టు 15 నుంచి ఆగ‌ష్టు 30కి వాయిదా ప‌డ‌డంతో సూర్య ప్ర‌భాస్‌కు పోటీగా వెళ్ల‌డం మంచిది కాద‌ని వెన‌క్కి త‌గ్గ‌డు. నిజానికి సాహోకు ప్ర‌పంచ వ్య‌ప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. అందుకే సూర్య కూడా ఆలోచించి బందోబ‌స్త్ సినిమాను సెప్టెండ‌ర్ 20న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్‌ చేసింది. అయితే సూర్య సినిమాల‌కు తెలుగులో ఓ చిక్కొచ్చి ప‌డింది.


నిజానికి సూర్య‌కు త‌మిళంలో ఉన్న క్రేజ్ తెలుగులో లేద‌నే చెప్పాలి. తెలుగులో వ‌రుస ఫ్లాపులు ఎదురుకుంటున్నాడు. ఇటీవ‌ల వ‌చ్చిన గ్యాంగ్‌, ఎన్‌జీకే సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. అలాగే ఒక‌ప్పుడు తెలుగులో రూ. 30 కోట్ల మార్కెట్ ఉన్న సూర్య మార్కెట్ ప్ర‌స్తుతం బాగా త‌గ్గిపోయింది. తెలుగులో అస‌ల సూర్య‌ను ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం రాబోతున్న బందోబ‌స్త్‌పై ఈ ఎఫెక్ట్ ప‌డింది. 


ఈ సినిమాను కొనేందుకు తెలుగులో బ‌య‌ర్లు కూడా ముందుకు రాని ప‌రిస్థితి ఏర్పండి. ఇది సూర్య లాంటి స్టార్ హీరోకు ఘోర అవ‌మానం లాంటిదే. ఒక‌ప్పుడు సింగం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో సూర్య మార్కెట్ తెలుగులో  ఘోరంగా ప‌డిపోయింది. మ‌రి ఈ సినిమాను తెలుగులో కొనేందుకు ఎవ‌రు ముందుకు వ‌స్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: