దాదాపు 20 సంవత్సరాల క్రిందట కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు సునీల్. బ్రహ్మానందం తరువాత కమెడియన్ గా తెలుగులో అంత మంచి పేరు తెచ్చుకుంది సునీల్ మాత్రమే. త్రివిక్రమ్ మాటల రచయితగా విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి సినిమాలు సునీల్ కు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టాయి. కమెడియన్ గా సంవత్సరానికి 25 సినిమాలకు పైగా నటించేవాడు సునీల్. 
 
కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగా సునీల్ కు హీరోగా అవకాశాలొచ్చాయి. సునీల్ హీరోగా నటించిన అందాల రాముడు సినిమా హిట్ అయింది. ఆ తరువాత కూడా కమెడియన్ గానే కొనసాగిన సునీల్ రాజమౌళి దర్శత్వంలో నటించిన మర్యాద రామన్న సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో కమెడియన్ పాత్రల్లో నటించకుండా హీరో పాత్రల్లో మాత్రమే నటించాడు. కానీ మర్యాద రామన్న తరువాత సునీల్ హీరోగా నటించిన ఒకటీ రెండు సినిమాలు హిట్టైనా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యయి. 
 
హీరోగా వరుస ఫ్లాపులు రావటంతో కమెడియన్ గా రీఎంట్రీకి ఓకె చెప్పాడు సునీల్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవిందసమేత వీరరాఘవ సినిమాతో సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. అరవింద సమేత వీర రాఘవ హిట్టైనా సునీల్ కామెడీకి పెద్దగా పేరు రాలేదు. అమర్ అక్బర్ ఆంటోనీ, పడి పడి లేచే మనసు, చిత్రలహరి సినిమాల్లో కూడా సునీల్ కామెడీ  పెద్దగా పండలేదు. 
 
ఇలాంటి సమయంలో బన్నీ త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కు అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సునీల్ పాత్ర నటుడు రావు రమేశ్ తో కలిసి ట్రావెల్ చేసే పాత్ర . కానీ కొన్ని కారణాల వలన ఈ పాత్రకు రావు రమేశ్ బదులుగా నటుడు అమృతం సీరియల్ ఫేమ్ హర్షవర్ధన్ ను తీసుకున్నారు. హర్షవర్ధన్ ను తీసుకోవటం వలన సునీల్ పాత్రనే ఈ సినిమానుండి తీసేసారని తెలుస్తుంది. హీరోగా సక్సెస్ కాని సునీల్ కు రీఎంట్రీ తర్వాత కమెడియన్ గా కూడా ఎందుకో కలిసిరావట్లేదు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: