టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాకు గ‌తంలో నాగ్ న‌టించిన మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్‌గా ఉండ‌ద‌ని తెలుస్తోంది. 2002లో వ‌చ్చిన మ‌న్మ‌థుడు సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు కె.విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇది కేవలం థియేటర్ రైట్స్ బిజినెస్ మాత్రమే. వాస్త‌వంగా చూస్తే నాగార్జున‌కు ఇటీవ‌ల మార్కెట్ త‌గ్గింది. అయినా మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌, ట్రైల‌ర్ వ‌చ్చాకే సినిమాకు కాస్త క్రేజ్ పెరిగి ఇంత మార్కెట్ జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక బిగ్‌బాస్ - 3 హోస్ట్‌గా కూడా నాగ్ దూసుకుపోతున్నాడు. ఇది కూడా సినిమాకు హెల్ఫ్ అవుతుంద‌ని ట్రేడ్ భావించి ఈ రేటు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. 


టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌లో నాగ్ ఈ వ‌య‌స్సులో కూడా మాంచి రొమాంటిక్ హీరోగా క‌నిపిస్తుండ‌డం, సినిమాలో రొమాన్స్‌కు, లిప్‌లాక్ సీన్ల‌కు కూడా స్కోప్ ఉంద‌న్న వార్త‌ల‌తో మ‌న్మ‌థుడు 2కు రిలీజ్‌కు ముందే మంచి బ‌జ్ వ‌చ్చింది. మ‌రి నాగ్ ఫైన‌ల్‌గా ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తాడో ?  చూడాలి. ఈ సినిమా లో సమంత, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ నెల 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మ‌న్మ‌థుడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్ :


నైజాం - 7 Cr


సీడెడ్ - 2.5 Cr


ఆంధ్ర - 7 Cr


ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ - 16.5 Cr


రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.60 Cr


ఓవర్సీస్ - 2.40 Cr
----------------------------------------
వరల్డ్ వైడ్ బిజినెస్ = 20.50 Cr



మరింత సమాచారం తెలుసుకోండి: