ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి పెద్ద డైలమాగా ఉంది. ఒకప్పుడు వరుసగా యంగ్ హీరోస్ పక్కన నటించి సూపర్ హిట్స్ అందుకొని హై రేంజ్ లో రెమ్యునిరేషన్ అందుకున్న రకుల్ ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గి పక్క భాషలవైపు చూస్తోంది. అయితే రకుల్ ఎంత కాన్ఫిడెంట్‌గా కనిపించినా ఆమె చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నాగార్జునతో నటించిన మన్మథుడు 2 సినిమా విడుదలయ్యాక.. రకుల్ టాలీవుడ్‌లో అయితే ఖాళీగా ఉంటుందనిపిస్తోంది. ఎందుకంటే ఇంకో తెలుగు సినిమా రకుల్ చేతిలో లేదు. కోలీవుడ్ లో మాత్రం రెండు సినిమాలున్నాయి. 

తమిళంలో భారీ డిజాస్టర్స్ సొంతం చేసుకున్నప్పటికి రకుల్... కమల్ హాసన్ సినిమా ఇండియన్ 2 లో కాజల్ తో పాటుగా సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇక బాలీవుడ్‌లో రకుల్ నటించిన మార్జావాన్ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా తప్ప తర్వాత బాలీవుడ్ లో వేరే సినిమాలేవీ లేవని తెలుస్తోంది. సీనియర్ హీరో నాగార్జున సరసన బోల్డ్‌గా సిగరెట్, మందు కొడుతూ మన్మథుడు 2 లో రకుల్ ప్రీత్ నటించింది. ఈ సినిమాలో రకుల్ చాలా హాట్ గా, స్పైసీగా కనిపిస్తుంది. ఇక మన్మథుడు 2 ప్రమోషన్స్ లోను రకుల్ ప్రీత్ చాలా హాట్ హాట్ డ్రెస్సులతో అదరగొట్టేస్తుంది. అయినా కూడా యంగ్ హీరోలు, స్టార్ హీరోల చూపు మాత్రం రకుల్ మీద పడడం లేదు. అందుకే రకుల్ కి తెలుగులో అవకాశాలు ప్రస్తుతానికి ఏమీ లేవు. 

మరి తమిళంలో ఉన్న రెండు సినిమాలైనా రకుల్ కెరీర్ ని డిసైడ్ చేస్తాయో లేదో చూడాలి. కారణం రకుల్ నటించిన మన్మథుడు 2 హిట్ అయినా... దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండేలా కనబడటం లేదు. ఎందుకంటే సీనియర్ హీరోల పక్కన నటించిన హీరోయిన్స్ కి డిమాండ్ అంతగా ఉండదన్న విషయం తెలిసిందే. మరి రకుల్ ప్రీత్ మన్మథుడు2  ఈ వారమే విడుదలకాబోతుంది. మరి ఆ మన్మథుడు తర్వాత వాట్ నెక్స్ట్ అంటూ రకుల్ కి సోషల్ మీడియాలో అభిమానులు అడుగుతున్నారు. మరి తన ఫ్యాన్స్ కి రకుల్ ఎప్పుడు రిప్లై ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: