విజయవంతంగా 14 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3 లో 15వ రోజు సైయ్యారే పాటతో అంతా నిద్రలేచారు. హుషారుగా స్టెప్పులు వేశారు. బాబా మాస్టర్, జ్యోతి డబల్ డబల్ పని చేస్తున్నారు. తమన్నా ఏమి పని చేయటం లేదని కెప్టెన్ వరుణ్ కి అరుణ్ వెళ్ళి చెప్పాడు. వరుణ్ లోపలకి వెళ్ళి పని చేస్తున్న మహేష్ ని చూసి తమన్నా చేస్తుంది కదా అన్నాడు. దానికి మహేష్, తమన్నా ఈ పని చేస్తే నేను గుండు కొట్టించుకుంటా అన్నాడు. వరుణ్ వెళ్లి తమన్నాను పని చేయొచ్చు కదా, చూడు వీళ్లంతా ఎలా మాట్లాడుతున్నారో అనగానే, దానికి తమన్నా నేనంటే అందరికీ చులకన అయిపోయిందని చెప్పింది. తరవాత వచ్చి తమన్నా ఊడుస్తుండగా మైక్ తగిలించుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు.
హౌస్ లో అంతా కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారని తమన్నా అంది.బెడ్ రూంలో హిమజతో వితికా నన్ను ఏ రీజన్ తో నామినేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరితోనూ నేను ఫైట్ చేయడం లేదు కదా అంది. తర్వాత గార్డెన్ లో వితికా ఆషు తో మాట్లాడుతూ బాబా మాస్టర్ మొన్న కావాలనే తమన్నాని జైలుకు పంపాడు. చూద్దాం ఎన్ని వారాలు ఉంటాడో అని చెప్పింది. బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాకు రావాలని వితికను పిలిచాడు. తరువాత రవిని కూడా రావాలని పిలిచాడు. ఛాయిసెస్ టాస్క్ లో భాగంగా వితికా రవికి కొన్ని ఛాయిసెస్ ఇస్తామని వారి నిర్ణయాన్ని రెడ్ లేదా గ్రీన్ బటన్ ప్రెస్ చేసి చెప్పాలనీ బిగ్ బాస్ అన్నాడు. ఒకవేళ వీళ్లు రెడ్ గ్రీన్ కలిసి ప్రెస్ చేస్తే ఇంట్లోని మగవారంతా వారం రోజులపాటు లివింగ్ ఏరియాలో నిద్రపోవాల్సి ఉంటుందని ఇద్దరూ కలిసి రెడ్ మరియు రెడ్ కాంబినేషన్స్ లో బటన్ ను ప్రెస్ చేస్తే మీరిద్దరూ వారం రోజుల పాటు గార్డెన్ ఏరియాలో నిద్రపోవాలని బిగ్ బాస్ చెప్పాడు.
ఒకవేళ గ్రీన్ మరియు గ్రీన్ కాంబినేషన్ లో బటన్స్ ప్రయత్నిస్తున్నట్లయితే ఇంట్లోని ఆడవాళ్ళు వారం రోజులపాటు కిచెన్ లోకి ఎంట్రవ్వకూడదని అన్నాడు.తరువాత బిగ్ బాస్ ఏదో చెప్పగానే వితిక రెడ్ బటన్ ప్రెస్ చేసింది. రవి గ్రీన్ బటన్ ప్రెస్ చేశాడు. టాస్క్ లో భాగంగా మగవారంతా వారం రోజులు లివింగ్ ఏరియాలో నిద్రపోవాలని బిగ్ బాస్ అన్నాడు. ఈ వారం నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వరుణ్ కెప్టెన్ కాబట్టి నామినేషన్ ల నుంచి సేవ్ అవుతాడని బిగ్ బాస్ చెప్పాడు. స్టోర్ రూమ్ లో ఉన్న ఒక స్టాంప్ ని వరుణ్ తీసుకు వచ్చాడు. స్టాంప్ ను నామినేషన్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల నుదిటి మీద తప్ప ముఖం లేదా ఎక్కడైనా వేయాలని సభ్యులకు బిగ్ బాస్ చెప్పాడు. అంతే కాకుండా నామినేట్ చేయడానికి గల కారణాలు తెలపాలని అన్నాడు.
మీరు స్ట్రాంగ్ అంటూ బాబా మాస్టర్ రోహిణీ చేతుల మీద తమన్నా స్టాంప్ లు వేసింది. తర్వాత రాహుల్ వెళ్లి మహేష్ ముఖంపై స్టాంప్ వేశాడు.అలీ కూడా స్టాంప్ వేసి వజ్రం విషయంలో చేసింది నచ్చలేదని రాహుల్ చెప్పాడు. వితికా వెళ్లి జ్యోతికి స్టాంప్ వేసి మీరు ఎమోషనల్, ఈ హౌస్ లో స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పింది, రెండో స్టాంప్ బాబా మాస్టర్ కు వేసింది. మహేష్ వెళ్లి రాహుల్ కి స్టాంప్ వేశాడు, రెండో స్టాంప్ పునర్నవికి వేశాడు. జ్యోతి వచ్చి వితికకు స్టాంప్ వేసి, నాకు ఆకలేస్తే తింటా, ఎమోషన్ వస్తే ఏడుస్తా, గతంలో నా విషయంలో నువ్వు వ్యవహరించింది సరి కాదని అందుకే స్టాంప్ వేసినట్టు చెప్పింది, రెండో స్టాంప్ తమన్నాకు వేసి మీరు చాలాసార్లు ఇబ్బంది పెట్టారని చెప్పింది.
రాహుల్ నాతో సరిగా మాట్లాడటం లేదని శ్రీముఖి అతనికి స్టాంప్ వేసింది, రెండో స్టాంప్ వితికకు వేసి కొన్ని సందర్భాల్లో నచ్చడం లేదని చెప్పింది. ఆషు వచ్చి శ్రీముఖి నాతో సరిగా మాట్లాడదు అంటూ స్టాంప్ వేసింది, తమన్నాకూ రెండో స్టాంప్ వేసింది. హిమజ వెళ్లి రాహుల్ కి స్టాంప్ వేసి సరిగా మాట్లాడరు అందుకే వేశానని చెప్పింది, చాలా అగ్రెసివ్ గా ఉంటుందని పునర్నవికి రెండో స్టాంప్ వేసింది. వరుణ్ వచ్చి మహేష్ కి స్టాంప్ వేసి టాస్క్ విషయంలో అన్నమాట బాగా లేదని అన్నాడు, గ్రూప్స్ అనేవి శ్రీముఖి వల్లే స్టార్ట్ అయ్యాయని తను ఒక గోడమీద పిల్లిలా ఉంటుందని ఆమెకు మరో స్టాంప్ వేశాడు. బాబా మాస్టర్, వితిక, పునర్నవికి స్టాంప్ లు వేస్తాడు. సడన్ గా బయటి నుంచి వచ్చి అందరినీ ప్రభావితం చేసిందనీ తమన్నాకూ రవి స్టాంప్ వేశాడు, ప్రతి దానికీ అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతుందంటూ హిమజకి కూడా స్టాంప్ వేశాడు.
తర్వాత అలీ వచ్చి తమన్నాకి స్టాంప్ వేశాడు, రెండో స్టాంప్ రాహుల్ వేశాడు. రోహిణి వచ్చి తమన్నాకి స్టాంప్ వేసి ఆమెకు ఉండాలని లేదు ఉంచడం కూడా కరెక్ట్ కాదని వేశానని చెప్పింది, సడన్ గా మూడు మార్చుకుంటుందని పునర్నవికి రెండో స్టాంఫ్ వేసింది. తరువాత పునర్నవి వచ్చి సెల్ఫీ నామినేటెడ్ అంటూ ఆమె ముఖంపైనే స్టాంప్ వేసుకుంది. ఎవరికి వారే నామినేట్ చేసుకోవడానికి వీల్లేదని పునర్నవికి బిగ్ బాస్ చెప్పాడు.ఒకవేళ నామినేట్ చేయకపోతే ఇంటి సభ్యులందరినీ నామినేట్ చేయాల్సి ఉంటుందని, ఈ నామినేషన్ ప్రక్రియ రద్దవుతుందనే బిగ్ బాస్ అన్నాడు. సరే అందరినీ నామినేట్ చేయమని పునర్నవి అంది. రవిని, తమన్నా చీటికీ మాటికీ తిడుతుంటే మిగతా వారంతా ఆమెపై మండిపడ్డారు.
ఇలా దిగజారొద్దని తమన్నాకి పునర్నవి వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో నామినేట్ అవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. పునర్నవి మీ కారణంగా ఇంటి సభ్యులంతా నామినేట్ అయితే దానికి శిక్షగా ఈ సీజన్ మొత్తం బిగ్ బాస్ నేరుగా మిమ్మల్ని నామినేట్ చేస్తారని చెప్పాడు. ఒకరి కారణంగా ఆట పాడవ్వకూడదు. ఇంటి సభ్యులంతా ఆలోచించుకొని నిర్ణయాన్ని చెప్పాలని అన్నాడు.పునర్నవిని పక్కకు తీసుకెళ్లి వరుణ్ సముదాయించాడు. నీ ఆట నువ్వు ఆడు. ఇద్దరినీ నామినేట్ చేయి అని చెప్పాడు. వరుణ్ వచ్చి బిగ్ బాస్ పునర్నవి ఇద్దరినీ నామినేట్ చేస్తుంది, మనం ప్రక్రియను కంటిన్యూ చేద్దామని చెప్పాడు.
పునర్నవి వెళ్లి జ్యోతి, బాబా మాస్టర్ కి స్టాంప్ వేసింది. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని, తమన్నా, పునర్నవి, రాహుల్, వితిక, బాబా భాస్కర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేందుకు నామినేట్ అయ్యారని బిగ్ బాస్ అన్నాడు. తరువాత తమన్నా ఇంత నీచానికి దిగజారతావా అంటూ రవిని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టింది. పర్సనల్ గా ఎటాక్ చేయొద్దని ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని వరుణ్, తమన్నాకూ చెప్పాడు. తరువాత నీ లెక్చర్ వింటానికి బిగ్ బాస్ హౌస్ కు రాలేదంటూ, రోహిణిపై తమన్నా గొడవ పెట్టుకుంది. గోతులు తీయడం ఇలాంటి వాళ్లకు తెలుసంటూ రవిని చూపించింది. ఈ విధంగా 15 వ రోజు సాగింది.