*నా పాత్ర పేరు అవంతిక. నా పాత్రకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. నా ఫన్ ఉండే పాత్ర నాది. పాత్రలో మంచి ఎనర్జీ ఉంటుంది. ఫన్‌తో మంచి మెచ్యూరిటీ కూడా ఉంది. నాటీగా కనపడుతుంది. స్టైలిష్‌గా కనపడే పాత్ర. ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర నాది. సాంగ్స్, సన్నివేశాలకు పరిమితమయ్యే పాత్ర కాదు. శామ్, అవంతిక పాత్రల మధ్య ప్రధానంగా నడిచే కథ ఇది. మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్. సినిమా ఎలా పూర్తయ్యిందో కూడా తెలియదు. సినిమాలోని అందరితో మంచి అనుబంధం ఏర్పడింది.
నాగార్జునగారు మంచి సపోర్ట్ కోస్టార్. సెక్యూర్ యాక్టర్. కొన్ని సీన్స్‌లో హీరోయిజంని పట్టించుకోకుండా కథకు ఏమీ అవసరమో దానికే ఆయన ప్రాధాన్యతను ఇచ్చారు. వ్యక్తిగతంగా చాలా నైస్ పర్సన్. అందుకొక ఉదాహరణ చెప్పాలంటే ఓ సాంగ్ షూట్లో ఆయన ఉన్న ప్లేస్‌కు లొకేషన్ గంట వ్యవధి పట్టేంత దూరంలో ఉంది. మిగిలిన యూనిట్ నాలుగు గంటలు వ్యవధి పట్టేంత దూరంలో లొకేషన్ ఉంది. విషయం తెలుసుకున్న నాగార్జునగారు.. అదేంటి? అలా ఎందుకు? నేను కూడా అందరితో పాటు ట్రావెల్ చేస్తానంటూ మాతో పాటు స్టే చేశారు.
* డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గురించి చెప్పాలంటే రాహుల్ నాకు `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమా నుండి తెలుసు. తను నా రాకీ బ్రదర్. మంచి టాలెంటెడ్ డైరెక్టర్. మంచి రైటర్. చాలా క్లారిటీ ఉన్న పర్సన్. ప్రీ ప్రొడక్షన్‌ను పక్కాగా చేసుకున్నారు. షూటింగ్ వెళ్లడానికి నెల ముందే నాకు బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాను. నాకే కాదు.. అందులోని నటీనటులందరికీ స్క్రిప్ట్ ఇవ్వడంతో నటించడం చాలా సులభమైంది. సెట్2లో ఎంత పనిచేసినా హ్యాపీగా, పాజిటివ్ వైబ్స్‌తో ఉంటారు. అందరినీ ఓ మూడ్‌లోకి తీసుకొచ్చి నటింప చేశారు. నా పాత్రను అద్భుతంగా రాశారు. నాతో పాటు ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది.
* నేను సైన్ చేసిన తర్వాతే నాగార్జునగారి `మన్మథుడు` సినిమా చూశాను. అలాగే `మన్మథుడు 2` ఫ్రెంచ్ సినిమా రీమేక్. ఆ ఫ్రెంచ్ సినిమాను కూడా నేను చూడలేదు. చాలా మార్పులు చేర్పులు చేశారు. రీమేక్ చేసేటప్పుడు మాతృకను చూస్తే ఎక్కడో రిజిష్టర్ అయిపోతుందని చూడలేదు.
*సీనియర్ హీరోలతో నటిస్తే జూనియర్ హీరోల సరసన అవకాశాలు రావని అనుకోను. ఎందుకంటే అజయ్ దేవగణ్గారితో నటించిన తర్వాత సిద్ధార్థ్‌తో నటించాను. తెలుగులో నాగార్జునగారితో నటించాను. ఇప్పుడు నితిన్‌తో నటించబోతున్నాను. రెండు, మూడేళ్లుగా సినీ ఇండస్ట్రీ మారుతుంది.