టాలీవుడ్ మ‌న్మ‌థుడు అన‌గానే మ‌న‌కు కింగ్ నాగార్జున గుర్త‌కు వ‌చ్చేస్తాడు. ఎప్పుడో 17 సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన నాగార్జున మ‌న్మ‌థుడు సినిమాతో నాగ్ ఇమేజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఆ సినిమాతో నాగ్ రొమాంటిక్ ఇమేజ్ డ‌బుల్ అయ్యింది. ఆ సినిమా వ‌చ్చిన 17 ఏళ్ల‌కు తిరిగి ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 తెర‌కెక్కుతోంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం మ‌న్మ‌థుడు 2 . 


కంప్లీట్ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 9న రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో నాగ్ మ‌రోసారి రొమాంటిక్ కింగ్‌గా ర‌చ్చ చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. సినిమా మొత్తంలో నాగ్ కామెడీ, రొమాన్స్ హైలెట్‌గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. 


యుక్త వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు అమ్మాయిలంటేనే పారిపోయే నాగార్జున పెళ్లి అంటేనే భ‌య‌ప‌డిపోతుంటాడు. చివ‌ర‌కు ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా చేసుకోడు. చివ‌ర‌కు ముదురు వ‌య‌స్సు వ‌చ్చాక ఓ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ అమ్మాయిని ఇష్ట‌ప‌డేలోగా ఆమె మ‌నోడిని వాడుకుని హ్యాండ్ ఇవ్వాల‌నుకుంటుంది. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య పుట్టే కామెడీతో మ‌న్మ‌థుడు 2 సినిమా న‌డుస్తుందంటున్నారు.


ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన ఈ సినిమా మ‌రో రెండు సినిమాల‌కు పోటీగా వ‌స్తోంది. మ‌రి నాగ్ రొమాంటిక్ ర‌చ్చ ఎలా ఉంటుందో ?  తెలియాలంటే ఈ నెల 9 వ‌ర‌కు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: