యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఎప్పుడు థియేట‌ర్లోకి వ‌స్తుందా ? అని అంద‌రూ క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న సాహో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కింది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని రెండు పాట‌ల‌ను ఇప్ప‌టికే రిలీజ్ చేశారు. ఈ రెండు పాటల వల్ల సాహో చిత్ర విజయంపై అనుమానాలు మొదలయ్యాయి. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ రెండు పాట‌లు ఆశించిన రేంజ్‌లో లేవ‌ని అంటున్నారు. కొంద‌రు నెటిజ‌న్స్ ఈ పాట‌ల‌పై ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇదిలా ఉంటే మ‌రో బ‌ల‌మైన సెంటిమెంట్‌ను కూడా కొంద‌రు ఉదాహ‌రిస్తున్నారు.


రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలు భారీ విజయాలు అందుకుంటారు... కానీ దాని తర్వాత మాత్రం ఘోర పరాజయాలు చవి చూస్తుంటారు. ప్ర‌తి ఒక్క టాలీవుడ్ హీరో కూడా రాజ‌మౌళితో హిట్ సినిమా ద‌క్కించుకుంటే ఆ త‌ర్వాత ఘోర‌మైన ప్లాపులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌, సునీల్‌, ర‌వితేజ ఇప్పుడు ఆ సెంటిమెంట్ సాహోను కూడా వెంటాడుతుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


ఇక కొంద‌రు బాహుబ‌లికి సాహోకు పోలిక‌లు పెడుతున్నారు. ఆ క‌థ వేరు, సాహో క‌థ వేరు. రాజ‌మౌళి రేంజ్ వేరు. రాజ‌మౌళికి సుజీత్‌కు లింకులు పెట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. మ‌రి ఈ బ్యాడ్ సెంటిమెంట్ల‌ను ప్ర‌భాస్ ఎలా అడ్డుకుంటాడో ?  సాహో పరిస్థితి ఏంటో ? ఆగస్టు 30 న తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: