జూనియర్ ఎన్టీఆర్ మరియు రాంచరణ్ క్రేజీ కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇక ఈ రెండు పాత్రలు కూడా రెండు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం . అల్లూరి సీతారామరాజుది ఆంధ్రప్రదేశ్ కాగా కొమరం భీం ది మాత్రం తెలంగాణ.



పైగా, ఈ ఇద్దరు కూడా సమకాలీకులు కాకపోయినప్పటికీ , ఎక్కడా ఇద్దరూ కలిసి పోరాటం చేయనప్పటికీ సినిమా సౌలభ్యంతో ఈ ఇద్దరినీ కలుపుతున్నాడు జక్కన్న .ఇద్దరు అసమాన యోధులు కలిస్తే బ్రిటిష్, నైజాం నవాబ్ లపై యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఎలా ఉంటుంది అన్నదే ఆర్ ఆర్ ఆర్ చిత్ర కథ . ఊహకే ఈ కథ ఎంతో ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తే అది రాజమౌళి చేతుల మీదుగా తీర్చిదిద్దితే ఆ ఇద్దరు యోధుల కథని తెరమీద చూసే భాగ్యం నయనానందకరమే అని చెప్పాలి.




ఐతే సినిమాలో ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు జక్కన్న ఇస్తాడో  వేచి చూడాలి.ఐతే ఈ క్యారెక్టర్స్ ని సినిమా సౌలభ్యం కోసం వాడుకుంటున్నాడు . అయితే దీనిపై విమర్శలు వస్తాయా ? లేక ప్రశంసలు పొందుతాడా ? అన్నది మాత్రం 2020 లో సినిమా విడుదల అయ్యాక కానీ తెలీదు.ఐతే ఈ సినిమా కోసం రాంచరణ్ చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.ఎందుకంటే ఇటీవలే రాంచరణ్ ఫోటో ఒకటి సోషల్ మీడీయా లో వైరల్ గా మారింది.ఆ ఫోటోలో రాంచరణ్ శరీరం బల్క్ గా కనపడుతుంది.క్యారెక్టర్ కు తగ్గట్టుగా శరీరాన్ని రాంచరణ్ బిల్డప్ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: