బిగ్ బాస్.. ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్‌లో ఇదో హాట్ టాపిక్.. సీజన్ త్రీలో ఎవరెవరు పాల్గొంటారు అన్నప్పటి నుంచి ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే అంశం వరకూ అంతా ఇంట్రస్టింగే.. ఈ బిగ్ బాస్ 3 ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేసినట్టుంది. అందుకే బిగ్ బాస్ 1, 2 కంటే.. ఈ సీజన్ త్రీ టీవీ రేటింగ్స్ బ్రహ్మాండంగా ఉంటున్నాయి..


అయితే తాజాగా బిగ్ బాస్ షో గురించి ప్రముఖ తెలుగు సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన తాజా వీడియో పరుచూరి పలుకులులో స్పందించారు. బిగ్ బాస్ త్రీ షో ఇంతగా హిట్ కావడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ విషయంలో హీరో నాగార్జునకు తాను కంగ్రాట్స్ చెబుతున్నానని తన వీడియోలో తెలిపారు. మొదటి, రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కు మరిన్ని రేటింగ్స్ పెరగడం విశేషం అన్నారు.


అయితే బిగ్ బాస్ 3 ప్రజలకు నచ్చుతున్నా.. కొన్ని విషయాల్లో తనకు నచ్చలేదంటూ తన అసంతృప్తిని బయటపెట్టారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. అదేంటంటే.. బిగ్ బాస్ రూల్స్ సమంజసంగా లేవంటున్నారీ పెద్దాయన. బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ మరీ 3, 4 రోజులకే ప్రారంభం అవుతుందని.. ఇది కరెక్ట్ కాదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.


బిగ్ బాస్ లో ఎంటర్ అయిన నాలుగైదు రోజుల వరకూ ఒకరికి ఒకరు పరిచయమే కారని.. ఇంతలోనే వారు.. ఒకరిని మరొకరు అర్థం చేసుకునే లోపే.. ఎలిమినేషన్ ప్రారంభం కావడం సమంజసం కాదన్నారు. కానీ బిగ్ బాస్ రూల్స్ .. ఆ సంస్థకు ఉంటాయని.. వాటిని తప్పుబట్టడం కాకపోయినా.. తన మనసులో మాట చెబుతున్నా అన్నారు. మొదటి వారం ఎలిమినేషన్ ఉండకూడదని.. ఫస్ట్ వీక్ అందరికీ వారు చేసిన తప్పులేంటో చెబితే.. ఆ తర్వాత ఎలిమినేషన్ ఉంటే.. బావుంటుందన్నారు పరుచూరి గోపాలకృష్ణ.


మరింత సమాచారం తెలుసుకోండి: