బిగ్ బాస్ షో అంటేనే నానా రచ్చలు, గొడవలు, కాంట్రవర్సీలు..వగైరాలన్నీ ఉంటాయన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్..ఇలా ఏ లాంగ్వేజ్ లోనైనా ఈ రచ్చలు మామూలే. అయినా కూడా ఈ షోకి పాపులారిటి మామూలుగా ఉండదు. అయినా కూడా షో ఒక స్టాండర్డ్స్ ని మేయింటేయిన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. హౌజ్ లో గొడవలు కామన్..హద్దులు దాటినా ఫర్వాలేదు అనిపించేది. రచ్చ జరిగినా ఎంటర్టేయినింగ్‌గా ఉండేది. కానీ ఎప్పుడైతే తమన్న సింహాద్రి ఎంటర్ అయిందో అప్పట్నుంచి బిగ్ బాస్ హౌజ్ లో పద్దతులు హద్దులు మారిపోయాయి. మొన్నటివరకు వివాదాలకే పరిమితమైన హౌజ్, తమన్న రాకతో అసహ్యంగా తయారైంది. ఇదేం షో రా బాబూ.. అంటూ ప్రేక్షకులు ఛీ కొట్టేలా తయారైంది.

నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా తమన్న మాటలకు హౌజ్ లో సభ్యులంతా నోరెళ్లబెట్టారు. ఆమెతో వాదనకు దిగడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపంచలేదు. తమన్నతో పెట్టుకోవడం ఎందుకనే ఆలోచన ఇంటి సభ్యులందరి ముఖాల్లో కనిపించింది. అందరిలోకల్లా పునర్నవి కాస్త చనువు తీసుకొని సర్దిచెప్పడంతో తమన్న తిట్ల పురాణం కొద్దిగా తగ్గింది. హౌజ్ లో ఏది జరిగినా ఫైనల్‌గా అది వీకెండ్ కి వచ్చే నాగార్జునకే చుట్టుకుంటుందనే విషయం తెలిసిందే. ఈసారి ఆ రచ్చ కాస్త తొందరగానే ప్రారంభమైంది. తమన్న లాంటి వ్యక్తి హౌజ్ లోకి వచ్చిందంటే నాగార్జున తెలీకుండా  జరగదని, ఇలాంటి విషయాల్లో నాగార్జున చాలా జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో సలహాలు వెళ్ళువెత్తుతున్నాయి. 

రానున్న రోజుల్లో తమన్న మాటలతో ఇంటి సభ్యుల సంగతేమో కానీ, నాగ్ పరువు మాత్రం పోవడం ఖాయమని నాగ్ ఫ్యాన్స్ ఖంగారుపడుతున్నారు. ఇదేగనక జరిగితే త్వరలోనే తమన్న ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె వ్యవహారశైలితో సభ్యులు ఇమడలేకపోతున్నారు. మరీ ఈ వారం గడిచేసరికి తమన్నా ఇంకెంతగా రచ్చ చేస్తుందో..! ఇదిలా ఉంటే ఈ షోకి టి.ఆర్.పి మాత్రం బాగా వస్తోంది. మరీ నాగ్ వచ్చే వీకెండ్స్ అయితే ఈ రేటింగ్ మామూలుగా ఉండటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: