సినిమాకు ప్రేక్షకులను రప్పించేది డెఫినెట్ గా హీరోలే.. అయితే దర్శకులను బట్టి సినిమాలకు వచ్చే ప్రేక్షకులు ఉంటారు. హీరోయిన్స్ కోసం వచ్చే ఆడియెన్స్ కూడా ఉన్నారన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే సినిమాల్లో హీరోయిన్స్ కూడా హీరోలతో సమానంగా కనిపిస్తున్నారు. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న హీరోయిన్స్ హీరోలకు ధీటుగా పాత్రలు చేస్తూ సర్ ప్రైజ్ ఇస్తున్నారు.


అయితే తెలుగు సినిమాల్లో హీరోలు మందు కొట్టడం.. సిగరెట్ తాగడం వంటివి ఎప్పటినుండో ఉన్నాయి కాని ప్రస్తుతం తెలుగులో వస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ కూడా దమ్ము కొడుతూ.. మందు అలవాటు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. పాత్రకు తగినట్టుగానే అలా చేస్తున్నామంటున్నారు కథానాయికలు. అయితే ఇదే మాట హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగితే మాత్రం హీరోలు తాగితే తప్పులేదు మేం తాగితే తప్పా అంటుంది.      


కింగ్ నాగార్జున హీరోగా మన్మథుడు 2 లో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించారు అంటే సిగరెట్ తాగా కదా అందుకే మీరు అలా అడుగుతున్నారా అంటూ ఎదురు ప్రశ్న వేసింది రకుల్.    


సినిమాలో బోల్డ్ నెస్ గా కనిపిస్తే సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రస్థావిస్తారు.. సినిమాల ద్వారా బ్యాడ్ హ్యాబిట్స్ ను ప్రోత్సహించడం లేదు.. అంతేకాదు అలాంటి సీన్స్ వచ్చినప్పుడు మధ్యపానం, ధూమపానం హానికరం అన్న స్లైడ్ వేస్తూనే ఉంటారు అంటుంది రకుల్. దే దే ప్యార్ దే, మన్మథుడు 2 రెండు సినిమాల్లో సీనియర్ హీరోల సరసన నటించారు కదా అంటే కథ బాగుంది కాబట్టే ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. లాస్ట్ ఇయర్ కాస్త వెనుకపడ్డట్టు అనిపించిన అమ్మడు ఈ ఇయర్ వరుస సినిమాలతో మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే కనిపిస్తుంది.          



మరింత సమాచారం తెలుసుకోండి: