సాధారణంగా సినీ తారలు పార్టీస్ లో  మందు కొట్టడం, దమ్ము కొట్టడం మామూలు విషయమే. అయితే ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం. స్టార్ హోదా ఉంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు ఉంటారు. కానీ స్క్రీన్ మీద మాత్రం అలాంటి సన్నీవేశాల్లో నటిస్తే మాత్రం పెద్ద ఎత్తున నానా రచ్చ జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించే రకుల్ ప్రీత్ సింగ్ సూటిగా ప్రశ్న వేస్తోంది. మన్మథుడు-2 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రకుల్.. తను సిగరెట్ తాగిన సన్నివేశాన్ని తప్పు పట్టొద్దంటుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సిగరెట్ తాగడం లాంటి బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఏమాత్రం వెనకాడనని తెగేసి చెప్పింది. అంతేకాదు మీడియాని ఏకిపారేసింది. 

తెలుగు సినిమా వైపు ఇండియా మొత్తం చూస్తుంది, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి.. ఇప్పుడు కూడా  మడికట్టుకొని కూర్చుంటే ఆర్టిస్ట్ అన్న పదానికి అసలు అర్థమే లేదని, కాస్త మెచ్యూర్డ్ గా ఉండాలని గట్టిగా చెప్పింది. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసిన జనం నేను సిగరెట్ తాగిన సీన్ మీద ఇంత రచ్చ చేయడం బాగాలేదంటోంది. అయినా హీరోలు సిగరెట్ తాగితే, మందు కొడితే తప్పుబట్టని సమాజం, హీరోయిన్లు తాగితే ఎందుకు రాద్దాంతం చేస్తోందని మరీ సూటిగా ప్రశ్నిస్తోంది.

అంతేకాదు కేవలం క్యారెక్టర్లు నచ్చడం వల్లనే అజయ్ దేవగన్, నాగార్జున లాంటి సీనియర్ నటుల సరసన నటించడానికి అంగీకరించానని.. భవిష్యత్తులో మరో మంచి పాత్ర దొరికితే మరో సీనియర్ హీరో సరసన నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తను ఎంచుకున్న పాత్రల గురించి కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి పంచ్ పేల్చింది.
ఇక మన్మథుడు-2 ఆగస్ట్ 9 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా భారతీయుడు-2 లో నటిస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: