బాలీవుడ్ క్వీన్ రీమేక్ గా తెలుగులో తమన్నా దటీజ్ మహాలక్ష్మి సినిమా తీయగా.. కోలీవుడ్ లో రమేష్ అరవింద్ డైరక్షన్ లో ప్యారిస్ ప్యారిస్ టైటిల్ తో రీమేక్ అయ్యింది. ఆ సినిమా టీజర్ లో కాజల్ బ్రెస్ట్ ప్రెస్సింగ్ సీన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఒక్క సీన్ తో టీజర్ మాత్రమే కాదు సినిమా కూడా హాట్ న్యూస్ గా మారింది.


కొన్నాళ్లుగా రిలీజ్ కు నోచుకోని ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే టీజర్ లో చూపించిన ఆ సీన్ మాత్రమే కాదు ఇంకా చాలా అభ్యంతరకమైన సన్నివేశాలు ఉన్నాయట. తమిళ నేటివిటీకి అవి అసలు ఆమోదించరని సెన్సార్ వాళ్లు వాటికి కత్తెర వేయాలని చెప్పారట. చిత్రయూనిట్ మాత్రం వాళ్లను బ్రతిమిలాడుతున్నట్టుగా తెలుస్తుంది.   


సినిమాలో అసలు మ్యాటర్ అదే కావడం.. దానికి కత్తెర పడితే సినిమాకు కష్టమని సెన్సార్ వాళ్లతో చెబుతున్నారట. ఇదంతా పక్కన పెడితే కాజల్ ఏ రేంజ్ లో రెచ్చిపోతే సెన్సార్ వాళ్లు బ్రేక్ వేసి ఉంటారని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కాజల్ పరిస్థితి అంతాగా ఏం బాగాలేదు. మరి ఇలాంటి టైంలో ప్యారిస్ ప్యారిస్ కాజల్ కు ఎంత క్రేజ్ తెస్తుందో చూడాలి. 


తెలుగులో ఆగష్టు 15న శర్వానంద్ రణరంగంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాజల్. ఈమధ్యనే బెల్లంకొండ శ్రీనివాస్ తో తీసిన సీత సినిమా నిరాశపరచింది. తెలుగులో రణరంగం.. తమిళంలో ప్యారిస్ ప్యారిస్ అమ్మడి ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తాయి. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబో మూవీకి కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అది నిజమే అయితే మాత్రం మరో రెండు మూడేళ్ల దాకా కాజల్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు.     



మరింత సమాచారం తెలుసుకోండి: