బిగ్ బాస్ లో తమన్నా వ్యవహారం శృతి మించిపోతుంది. గత రెండు రోజుల నుండి ఆమె ప్రవర్తిస్తున్న విధానం పేక్షకులకి ఆమె మీద చీదర పుట్టేలా చేస్తున్నాయి.  నామినేషన్ ని స్పోర్టివ్ గా తీసుకోకుండా, తనను నామినేట్ చేసిన రవిక్రిష్ణ పై వ్యక్తిగత దూషణ చేయడం వల్ల ఆమె పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమన్నా రవిక్రిష్ణ ని టార్గెట్ చేసి పప్పు పప్పు అని అవహేళన చేస్తుంటే అతను దానికి రియాక్ట్ అవకుండా సంయమనాన్ని పాటించాడు. 


కానీ ఆమె ఎంత ఎక్కువ చేసినా అతను ఏమీ పట్టనట్టు ఉండటమే బాలేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. కొంత టైం వరకు ఓపికగా ఉండటం మంచిదే కానీ శ్రుతి మించుతున్నప్పుడు ఎంత ఓపికగా ఉన్నా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో తమన్నాని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.రోల్ మోడల్ గా వచ్చాను అన్నారు ఇలాగేనా మీరు ప్రవర్తించేది అంటూ తమన్నాని హెచ్చరించే ప్రయత్నం చేసాడు.  


దీంతో రవిక్రిష్ణ చేయనిది రాహుల్ చేయడంతో ప్రేక్షకుల్లో రాహుల్ పై అభిమానం పెరిగిందనే చెప్పాలి. రవిక్రిష్ణ ఏమీ మాట్లాడట్లేదని చూసిన ప్రేక్షకులు రాహుల్ మాట్లాడడంతో కొంత కూల్ అయ్యారు.నామినేషన్  లో ఉన్న రాహుల్ కి ఒక రకంగా ఇది ప్లస్ అవుతుందనే చెప్పవచ్చు. ఈ వారం తమన్నా హౌస్ నుండి బయటకు వెళ్ళే అవకాశాలు వంద శాతం కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.


హౌస్ మేట్స్ అందరికీ ఇప్పటికే ఆమె అంటే దురభిప్రాయం వచ్చేసింది. ఇప్పటికైనా ఆమె తన ప్రవర్తనని మార్చుకుంతే బాగుంటుందని అనుకుంటున్నారు. బిగ్ బాస్ లో ఇలా పర్సనల్ గా ఒకరి మీద విరుచుకు పడటం అనేది ఎప్పుడూ జరగలేదు. తమన్నా రాకతో బిగ్ బాస్ హౌస్ ఇలా అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: