ఎంతో హిట్టు కొట్టి రికార్డులు సృష్టిస్తూ ముందుకు పోతున్న పవన్ సినిమా వర్గాలు డేంజర్ లో పడ్డాయి. ‘అత్తారింటికి దారేది’ హిట్టు జోష్ లో హోష్ లేకుండా చేసిన పని వారిని కోర్టు మెట్లు ఎక్కించే పరిస్తితిని కల్పించేలా ఉంది. ఈ సినిమా విడుదలై 30 రోజులయిన సంధర్భంగా కొత్త పోస్టర్లను విడుదల చేసారు. ఈ పోస్టర్లపై ‘ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ 100 ఇయర్స్ ఇండియన్ సినిమా’ అని పేర్కొన్నారు. అంటే వందేళ్ల భారతీయ సినిమాలో ఇంత బిగ్ హిట్ లేదని దీని అర్థం. ఇది టాలీవుడ్ వర్గాలనే అవాక్కయ్యేలా చేయగా, బాలీవుడ్ లో సైతం దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలా తప్పుడు ప్రచారంపై కొందరు కోర్టుకు వెల్లే ఆలోచనలో ఉన్నారట. ఇదే జరిగితే ఈ సినిమా వర్గాలు డేంజర్ లో పడ్డట్టే. అయితే వారే కాదు పవన్ కూడా.. ‘అలా పోస్టర్లపై పెట్టమనలేదు, పైగా తాము చూసిన వాటిలో అలా లేదు, ఆ పోస్టర్లు ఎలా వచ్చాయి’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జరిగింది పొరపాటని చెప్పి సరిదిద్దుకుంటే వ్యవహారం సామరస్యంగా ముగిసిపోతుంది అంటున్నారు సినిమా వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: