రకుల్ ప్రీత్ సింగ్ అందమే కాదు, అభినయమే కాదు. డేరింగ్ అండ్ డేషింగ్ లేడీ. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. తన మీద ఈగ కూడా వాలనివ్వదు. ఆమెకు కోపం వచ్చిందంటే అంతే... ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె చాల యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరైనా తన గురించి తప్పుగా అంటే వారు గూబ గుయ్యిమనిపించేలా కౌంటర్లేస్తుంది. రకుల్ తో పెట్టుకుంటే అంతే సంగతులని చెప్పకనే చెబుతుంది. రకుల్ పూర్తి మెచ్యూరిటీతో ఉంటుంది. తన డెసిషన్స్ అన్నీ తాను కరెక్ట్ గా ఆలోచించి తీసుకున్నవేనని చెబుతోంది.


తనకు లేని బాధ మీకెందుకు అంటూ నెటిజన్లను అడుగుతోంది. అలాగే తనపైన విమర్శలు చేస్తున్న వారిని కూడా ఆమె గట్టిగా ప్రశ్నిస్తోంది. రకులు ఏజ్ బార్ హీరోలతో చేస్తోందన్న కామెంట్లపై ఆమె మండిపోతోంది. నా ఇష్టం చేస్తాను, అయితే మీకేంటి అంటోంది రకుల్. ఏం చేయకూడదా. నా రోల్ ఏంటో నాకు బాగా తెలుసు. సలహాలు చెప్పేవారు హద్దుల్లో ఉంటే మంచిదని గట్టిగానే సెటైర్లు వెస్తోంది. ఇదంతా రకుల్  అజయ్ దేవ్ గణ్ , నాగార్జున‌లతో వరసగా రెండు మూవీస్ రకుల్ చేసిన ఫలితం. ఆమెను నెటిజన్లు ఒకటే ట్రోల్ చేస్తూంటే మీడియాలో ఆర్టికల్స్ కూడా రకుల్ తప్పు చేస్తోంది అన్నట్లుగా వస్తున్నాయి



లేటేస్ట్ గా మన్మధుడు 2 ప్రమోషన్లో భాగంగా అన్ని కామెంట్లకు ఒకే సమాధానం రకుల్ ఇచ్చేసింది. నేను నా పాత్రను చూసుకుంటాను తప్ప ఆపోజిట్ హీరో ఏజ్ చూడనని రకుల్ కచ్చితంగా చెప్పేస్తోంది. స్టోరీలో రకుల్ పాత్రకు ఇంపార్టంట్ ఉందా లేదా అన్నది చూడాలి తప్ప అవతల హీరో ఏజ్ తో లింకెందుకు పెడతారు అని సూటిగా ప్రశ్నిస్తోంది. అయినా తనకు చాన్సులు ఇక రావు అన్న వారంతా మూర్ఖులు అని కూడా కామెంట్స్ చేస్తోంది.



నాగ్  తో చెసిన తరువాతనే తనకు నితిన్ మూవీలో చాన్స్ వచ్చిందని రకుల్ ఉదహరిస్తోంది. యంగ్ హీరోలతో చేస్తాను, సీనియర్లతో చేస్తాను, నాకు కావాల్సింది నా పాత్ర  సినిమాలో ఏంటన్నది. అది బాగుంటే ఏ సినిమాకైనా సైన్ చేస్తానని రకుల్ క్లారిటీగా చెబుతోంది. కధ ప్రకారమే మన్మధుడు 2 లో సిగరెట్లు తాగానని, సినిమాలో బోల్డ్ గా కనిపించానని రకుల్ అంటోంది. అసలు స్టోరీ వేరని, అది రివీల్ చేయనని, సినిమా చూస్తే అర్ధమవుతుందని అంటోంది. మొత్తానికి రకుల్ గడుసుగా తెలివిగా మాట్లాడుతోంది. ఇంక ట్రోలింగ్ స్టాప్ చేయడం బెస్టేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: