ప్రభాస్ కుటుంబ సభ్యులు గురించి ఎప్పుడు ఎక్కడా బయటకు చెప్పడు. అతడి పెదనాన్న కృష్ణంరాజు గురించి తప్ప అతడి కుటుంబ సభ్యుల పేర్లు కూడ పెద్దగా బయటకు రావు. ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ విడుదల బిజీలో ఉన్న ప్రభాస్ పై లేటెస్ట్ గా పెళ్ళి వార్తలను ప్రచారంలోకి తీసుకు వచ్చిన బాలీవుడ్ మీడియా అతడి సిస్టర్ ప్రగతి ఉప్పలపాటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రచారంలోకి తీసుకు వచ్చింది.

ప్రభాస్ కు తన సిస్టర్ ప్రగతితో మంచి సాన్నిహిత్యం ఉండటమే కాకుండా ఆమె సలహాలను ప్రభాస్ తీసుకుంటాడు అంటూ ఆకథనంలో పేర్కొంది. ప్రభాస్ నటించే సినిమాల స్క్రిప్ట్ ను ముందుగా చదివి ప్రభాస్ కు సలహాలు అందించే ప్రగతి ప్రభాస్ పెళ్ళి విషయంలో అతడి మనసు మారేలా తీవ్ర ఒత్తిడి చేస్తోంది అంటు ఆ కథనంలో పేర్కొంది.

అమెరికాకు సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి పెళ్ళి సంబంధం విషయంలో రాయబారాలు అన్నీ ప్రగతి ద్వారానే జరిగినట్లు తెలుస్తోంది. ‘సాహో’ విడుదల అయిన తరువాత ప్రభాస్ ను పెళ్ళి సంబంధం విషయంలో ఒప్పించే బాధ్యతను ప్రగతి తీసుకుంది అంటూ ఆమీడియా సంస్థ తన కథనంలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 

ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేకసార్లు వార్తలను ప్రచురిస్తూ బాలీవుడ్ మీడియా హడావిడి చేసిన నేపధ్యంలో ఈప్రగతి వార్తలు ఎంతవరకు నిజం అన్న కోణంలో ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ పెళ్ళి పై వార్తలు అంటే ఒక జోక్ అయిన నేపధ్యంలో ఈవార్తలలోని నిజాలు ఎన్నో ‘సాహో’ విడుదల వరకు సస్పెన్స్..

 


మరింత సమాచారం తెలుసుకోండి: