ఒక‌ప్పుడు ప్రేక్ష‌కులు రీమేక్ చిత్రాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. ప్రేక్ష‌కుడి ఆలోచ‌నా విధానం మారింది. క‌థ బావుంటే చాలు అందులో న‌టించే న‌టీన‌టుల గురించికాని, అది రీమేక్ లేక స్ట్రయిట్ మూవీనా అని ఆలోచించ‌డం లేదు. క‌థ న‌చ్చితే చాలు ఆ సినిమా బాక్సీఫీస్ ముందు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.  


ప్ర‌స్తుతం తెలుగు సినిమాలకి  బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది... తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి కి రీమేక్ కబీర్ సింగ్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది.. ఇదే బాటలోకొంతమంది బాలీవుడ్ హీరోలు తమ కొడుకుల కోసం  తెలుగు లో హిట్ అయిన సినిమాల రీమేక్ కోసం ప్రయత్నిస్తున్నారు. 
బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న కుమారుడిని హీరోగా చేయాలని ఆశపడుతున్నారు..సరైన సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు..ఆ ప్రయత్నాల్లో భాగంగా తెలుగులో చిన్న సినిమా గా వచ్చి భారీ హిట్ ని సాధించిన ఆర్ ఎక్స్ 100 సినిమాను ఎంచుకున్నారు..ఆర్ ఎక్స్ 100 తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా భారీ విజయాన్ని అందుకుంది..రొమాన్స్ తో కూడిన ఈ యాక్షన్ మూవీ యూత్ కి విపరీతంగా నచ్చేసింది...అందుకే సునీల్ శెట్టి తన కొడుకు అహన్  శెట్టి కోసం ఈ కథను ఎంచుకున్నట్టు గాతెలుస్తున్నది.. మిలన్ లూథ్రియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అహన్  శెట్టి కి జోడీగా తారా సుతారియా  నటిస్తుందని సమాచారం.


తెలుగు అర్జున్ సింగ్ రీమేక్ కబీర్ సింగ్  లాగానే ఈ ఆర్ ఎక్స్ 100 రీమేక్ కూడా హిందీలో భారీ విజయాన్ని అందుకుంటే ఇంకా తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో డిమాండ్ పెరుగుతుంది అనే చెప్పాలి. ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమాల‌ను మ‌న తెలుగు ద‌ర్శ‌కులు రీమేక్ చేసేవారు. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. తెలుగు సినిమాల‌కు బాలీవుడ్‌లో డిమాండ్ పెరుగుతుంది. బాహుబ‌లి చిత్రంతోనే తెలుగు ఇండ‌స్ట్రీ ఖ్యాతిని పెంచారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇలా మ‌న మ‌న తెలుగు చిత్రాల‌కు ఎన‌లేని ఆద‌ర‌ణ దొర‌క‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌య‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: