విజువల్ వండర్ సినిమాలు ఊహించాలంటేనే భయపడే సమయంలో తన సినిమాల ద్వారా విజువల్ గ్రాఫిక్స్ ని ఒక రేంజ్ లో చూపించిన దర్శకుడు శంకర్. ఇండియన్ జేమ్స్ కామెరూన్ పేరు పొందిన ఈ దర్శకుడి సినిమా కోసం భారతదేశం మొత్తం వెయిట్ చేస్తుంది. తన సినిమాల్లో సోషల్ మెసేజ్ ని కమర్షియాలిటీని ఎక్కడ తగ్గించకుండా బ్యాలన్స్ గా సినిమాలు తీస్తాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో పాటలకి ఉన్న ప్రత్యేకతే వేరు.


రోబో 2.O చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. బడ్జెట్ కారణం వల్ల భారతీయుడు సినిమా ఉంటుందో ఉండదో అనే అనుమానాలు వచ్చాయి.  ఐతే శంకర్ ప్రస్తుతం బడ్జెట్ సమస్యల్ని దూరం చేసుకుని భారతీయుడు సీక్వెల్‌ షూటింగ్ ను మళ్లీ ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నాడు.


 అయితే ఈ చిత్రం తర్వాత శంకర్‌ సముద్రం నేపథ్యంలో సాగే ఓ ‌3డి సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు కూడా పూర్తయిందట.కాగా ఫుల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ గా రానున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ నటిస్తున్నారట. విజువల్‌ ఎఫెక్ట్స్ అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట.


గత సినిమా రోబో 2.0లో అక్షయ్‌ కుమార్‌ తో కలిసి పని చేసిన శంకర్.. ఈ సారి షారుఖ్ తో కలిసి పనిచేయబోతున్నాడు అన్నమాట.ఇక ఈ సినిమాలో మరికొన్ని పాత్రల్లో తెలుగు తమిళ నటీనటులు కూడా నటిస్తారట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో గాని.. శంకర్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: