హ్యాపీడేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మరో లవర్ బోయ్ దొరికాడని అనుకున్నారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం కూడా హిట్ అవడంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. హీరోగా ఛాన్సులు ఆగిపోయే సరికి సైడ్ రోల్స్ కూడా ఒకటి రెండు సినిమాల్లో చేశాడు వరుణ్ సందేశ్.


ఇదిలాఉంటే వరుణ్ సందేశ్ బిగ్ బాస్ ఎంట్రీ సర్ ప్రైజింగ్ గా అనిపించింది. ఒక్కడే కాదు ఏకంగా భార్య వితికతో హౌజ్ లోకి వచ్చాడు వరుణ్ సందేశ్. వరుణ్, వితిక గుడ్ కపుల్.. హౌజ్ లో కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 మూడవ వారం కొనసాగుతుంది. అయినా సరే వరుణ్ సందేశ్ హీరో ఇమేజ్ ఎక్కడ కనిపించలేదు.


మొదటి వారం మహేష్ కత్తితో గొడవ అతనికి బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మహేష్ కు మొదట వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదని అందరు అన్నారు. నాగార్జున కూడా ఈ విషయంలో వరుణ్ సందేశ్ ను మందలించాడు. ఇక ప్రస్తుతం ఇంటి కెప్టెన్ గా ఉన్న వరుణ్ సందేశ్ తమన్నా సింహాద్రి చేస్తున్న అతిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. హౌజ్ లో ఇంటి సభ్యులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కెప్టెన్ కు ఉంటుంది.  


తమన్నా రవి కృష్ణను అలా టార్గెట్ చేస్తుంటే కెప్టెన్ గా వరుణ్ తమన్నాకి అడ్డుపడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంటి నియమాలను అతిక్రమించకుండా చూడాల్సిన బాధ్యత కెప్టెన్ కు ఉంటుంది. అయితే వరుణ్ సందేశ్ మాత్రం అన్నది తనని కాదు కదా తనకు ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా చూస్తున్నాడు. హీరోగా ఇదవరకు సక్సెస్ లను అందుకున్న వరుణ్ సందేశ్ బిగ్ బాస్ హౌజ్ లో ఇలా హీరోనా.. విలనా అన్న డౌట్ కలిగేలా చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: