పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీలో మోత మోగిపోయింది. అయితే ఆ పేరు తర్వాత సినిమాలకు వినిపించలేదు. ఇక డిజె సినిమా యావరేజ్ అవడంతో ఆ తరువాత బోలెడు గ్యాప్ వచ్చింది డైరక్టర్ హరీష్ శంకర్ కు. ఆఖరికి 14 రీల్స్ సంస్థలో ఎప్పటినుంచో అనుకుంటున్న జిగర్తాండ రీమేక్ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ ప్రాజెక్ట్ అంతా సాఫీగా సాగుతుందనుకుంటే నిర్మాతలకు-డైరక్టర్ కు మధ్య విభేధాలు వచ్చాయన్న గాసిప్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే ఈ ఇష్యూని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భాగస్వామి శిరీష్ వెళ్లి సెట్ చేసి వచ్చినట్లు సమాచారం.

ఇలా విభేధాలు రావడానికి అసలు కారణం ఈ సినిమాను ప్రాఫిట్ షేరింగ్ మీద, రెమ్యూనిరేషన్ లేకుండా చేస్తున్నారట దర్శకుడు హరీష్ శంకర్. ఇక ఈ సినిమా మరో నెలరోజుల్లో విడుదల కావాల్సి వుంది. సెప్టెంబర్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం ఎంతగానో ప్రయత్నిస్తూ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను కంప్లీట్ చేస్తోంది. మరోవైపు మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడే ఏదో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. తను డైరెక్ట్ చేస్తున్న సినిమాకు ఈ రేంజ్ రేట్లు వస్తాయని హరీష్, అంత రావు.. అన్నట్లుగా 14 రీల్స్ నిర్మాతలు అనుకుంటున్నారట.

అయితే కావాలనే తనకు తక్కువ చెబుతున్నారేమో అని హరీష్ అనుమాన పడుతున్నారని మరో న్యూస్. దీంతో కావాలంటే రెమ్యూనిరేషన్ తీసేసుకోండి, తాము సినిమాను డైరక్ట్ రిలీజ్ చేసుకుంటాం అని 14 రీల్స్ వాళ్ళు చెప్పినట్లు తాజా సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని శిరీష్ మాట్లాడి దర్శకుడు హరీష్ శంకర్-14 రీల్స్ నిర్మాతల మధ్య సంధి కుదిర్చినట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే హరీష్ శంకర్ కానీ నిర్మాతలు గానీ క్లారిటి ఇవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: