టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా కలసి నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం, అదీకాక విజయ్ గత సినిమాల సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉండడంతో డియర్ కామ్రేడ్ కు ఓపెనింగ్స్ మాత్రం అదరగోట్టాయి. అయితే తొలిరోజు కాస్త మిక్స్డ్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా జర్నీ, 

ప్రస్తుతం అవేరేజ్ నుండి ఫ్లాప్ పరిస్థితికి చేరుకుంటున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవానికి సినిమా కోసం మంచి పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు, దానిని పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని ఆకర్షించే విధంగా తీయడంలో మాత్రం విఫలమయ్యాడని వారు అంటున్నారు. సినిమాలో విజయ్ మరియు రష్మికల నటన, అలానే స్క్రీన్ పై వారిద్దరి జోడి ఎంతో బావుందని, ఇక జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం కూడా ఆడియన్స్ ని అలరించినప్పటికీ, అవి సినిమాను ఏ మాత్రం కాపాడలేకేపోయాయని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాను త్వరలో హిందీలో రీమేక్ చేద్దాం అని భావించి, తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన కరణ్ జోహార్ తెలుగులో సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, రీమేక్ ను నిలుపుదల చేయాలని భావిస్తున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

నిజానికి విజయ్ దేవరకొండకు వున్న క్రేజ్ తో సినిమా మెల్లగా పుంజుకుంటుందని చిత్ర నిర్మాతలు భావించినప్పటికీ, కథ మరియు కథనాల్లో కొన్ని లోపాల కారణంగా సినిమా చాలావరకు చతికిలపడిందంటున్నారు. అయితే ఈ సినిమా హిందీ రీమేక్ ని కరణ్ జోహార్ ఆపేసారు అనే వార్త విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ,  దానిపై ఇప్పటివరకు వారి నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఆ వార్తను పూర్తిగా విశ్వసించలేమని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరొకిద్దిరోజలు ఓపిక పట్టాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: