నభా నటేష్ నక్కను తొక్కలేదు, లక్కుని కూడా పక్కన పెట్టుకోలేదు. నన్ను దొచుకుందువటె మూవీతో ఆమె టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు కి పెయిర్ గా ఆ మూవీలో మెరిసింది. ఆ తరువాత ఆమెకు  ఆఫర్లు ఏవీ వెల్లువలా తన్నుకుంటూ రాలేదు. ఇక నభా నటేష్ పని సరి అని అనుకుంటున్న వేళ ఆమెకు పూరీ జగన్నాధ్ మంచి చాన్స్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ లో ఆమెను అందాల దేవతలా చూపించాడు. ఆ మూవీ సెన్సేషనల్ హిట్ కావడంతో నభా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.


ఈ మూవీ సక్సెస్ తో నభాకు ఆదిరిపోయే ఆఫరే వచ్చిందట. తమిళ్ లో ఓ పెద్ద స్టార్ పక్కన నటించేందుకు నభాకు అవకాశం దక్కిందట. ఈ విషయాన్ని నభ స్వయంగా ఫ్యాన్స్ తో చాట్ చేస్తూ చెప్పిన మాట. ఆ మూవీ వివరాలు రివీల్ చేయకపోయినా తనకు మంచి ఆఫర్ కోలీవుడ్లో వచ్చిందని నభా నటేష్ చెప్పడంతో కోలీవుడ్ యూత్ ఫిదా అవుతోంది. నభాకు కోలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ మెయిల్ ఉందిట. అందులో నుంచే ఒక యువ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు నభా ఈ జవాబు చెప్పింది.


మరి టాలీవుడ్లో ఇంతటి హిట్ కొట్టిన నభాకు ఇక్కడ చాన్సులు రావడం లేదా అన్నదే ప్రశ్న. ఆమె అందాలన్నీ పూరీ చూపించేశాక మేము తీసేదేంటి అని టాలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారో ఏమో కానీ ఇప్పటికైతే కన్ ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ మాత్రం ఒకటీ లేదట. ఇక నభా ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తోందని టాక్. టాలీవుడ్లో ఎలాగైనా టాప్ ప్లేస్ చేరుకోవాలన్న ఈ ముద్దు గుమ్మ పట్టుదల ఎంతవరకు నెరవేరుతుందన్నది చూడాలి.


ఇక నభా మాత్రం ఒకటి కచ్చితంగా షరతు పెట్టుకుందని అంటున్నారు. ఇకపై వచ్చిన ఇమేజ్ తో మంచి బ్యానర్లు, మంచి కధలు అయితే చూజ్  చేసుకోవాలనుకుంటోందట. మరి ఆమెతో మూవీస్ అంటే పెద్ద హీరోలు ఎలా స్పందిస్తారో. ఇక నభా చిన్న హీరోలకు ఛిక్కుతుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయూట. పాతిక లక్షలు ఉండే పారితోషికాన్ని ఈ అమ్మడు ఇస్మార్ట్ శంకర్ హిట్ తో  ఒక్కసారిగా యాభైకి పెంచేసింది. దాంతో ఆమెను ఇపుడు స్టార్ హీరోలు అయితేనే భరించగలరని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: