ఈ మద్య చాలా మది నటీ, నటులు ఏదైనా విదాస్పద అంశం తెరపైకి వస్తే దానిపై తమదైన శైలిలో స్పందించడం ఎన్నో వివాదాలకు చెలరేగుతున్నాయి.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక్క కుదుపు కుదిపేసిన ఆర్టికల్ 370 అంశం పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయితే భారతీయులకు ఇది సమ్మతమైతే దాయాది దేశం మాత్రం నిప్పులు చెరుగుతుంది.  తాజాగా జమ్మూకాశ్మీర్ పై పాకిస్థాన్ సినీ నటి మహీరాఖాన్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

ఇక ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి పూర్తిగా రద్దు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ ని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ పార్లమెంటులు బిల్లుకి ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.   తాజాగా ఈ అంశంపై పాకిస్తాన్ నటి  మహీరాఖాన్  సంచలన ట్విట్ చేయడం పై భారతీయులు అగ్గిలమీద గుగ్గిలం అవుతున్నారు.  పాక్ సినీనటి మహీరాఖాన్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''మేము పరిష్కరించడానికి ఇష్టపడని వాటిని సౌకర్యవంతంగా నిరోధించారా? ఇది ఇసుక మీద గీసిన గీతలకు మించినది, ఇది అమాయక ప్రాణాలను కోల్పోవడంగురించి స్వర్గం మండుతోంది ...మేం నిశ్శబ్దంగా రోదిస్తున్నాం'' అంటూ అంటూ తన అభిప్రాయం తెలిపింది.


అంతే ఈ ట్విట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దాంతో చాలా మంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ బలూచిస్థాన్, సింధ్ ఎంత అభివృద్ధి చెందాయి? దీనికోసం మీ గుండె ఎందుకు కాలిపోవడం లేదని ఓ నెటిజన్ ప్రశ్నించారు.  అంతే కాదు చాలా మంది నెటిజన్లు ఆమెను ప్రత్యక్షంగా తిట్టి పోస్తున్నారు. కాశ్మీర్ మాది, మా ప్రభుత్వం శాంతిని కాపాడేందుకు ఈ చర్య తీసుకుంది..మా కశ్మీర్ విషయంలో మేం ఏమైనా చేస్తాం, కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది  అంటూ మరో నెటిజన్ మహీరా మాటలకు ఘాటుగా బదులిచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: