ప్ర‌పంచ‌మంతా క్రేజీగా ఎదురు చూస్తున్న చిత్రం సాహో.  ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి పాత్ర‌ను ఒక్కోరోజు ఒక్కో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ ప్రేక్ష‌కుల‌లో మ‌రింత క్రేజ్ పెంచుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన కొన్ని స్టిల్స్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు నటుడు చుంకీ పాండే లుక్ ని విడుదల చేశారు.


బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ సినిమా చూసిన వాళ్లకు చుంకీ పాండే ని మర్చిపోరు. పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో  ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప్రెస్టీజియస్ సాహో సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. 


కామెడీ క్యారెక్టర్ చేయడంలో చుంకీ పాండే అందే వేసిన చేయి. అలాంటిది... ఇప్పుడు యాక్షన్ చేయబోతున్నాడు. విభిన్నమైన పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. స్టైలిష్ యాక్షన్ రోల్ చేయబోతున్నాడు. ఈ క్యారెక్టర్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. అనే పవర్ ఫుల్ క్యాప్షన్ తో కూడిన ఈ పోస్టర్ ని చూస్తేనే అర్థమౌతోంది... చుంకీ పాండే ఎంతటి సీరియస్ పాత్ర పోషిస్తున్నాడో.. భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్ డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే చుంకీ పాండే పాత్ర సినిమాలో చాలా కీలకం.

యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీ తో తెరెకెక్కుతుంది.  ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: