శ‌ర్వానంద్ ఎంచుకునే క‌థ‌ల‌న్నీ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. దాదాపుగా శ‌ర్వా న‌టించిన చిత్రాల‌న్నీ హ‌ట్ల‌నే చెప్పాలి. ఎక్క‌డో ఒక‌టి, రెండు చిత్రాలు త‌ప్పించి అన్నీ హిట్లే. అయినా త‌ను హిట్ల‌తో ఫట్ల‌తో సంబంధంలేకుండా వ‌రుస‌గా సినిమాల‌ను చేసుకుంటూ వెళ‌తాడు. ప్ర‌స్తుతం ర‌ణ‌రంగం అనే చిత్రంలో న‌టించారు. నాగ‌వంశీ  నిర్మిస్తున్న ఈ చిత్రంలో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శి హీరోయిన్‌గా న‌టించింది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ... ఈ రోజు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. ఆగస్టు 15 న 'రణరంగం' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు   తెలిపారు. ఇటీవల కాకినాడలో ప్రేక్షకాభిమానుల సమక్షంలో విడుదల అయిన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. దర్శకుడు సుధీర్ వర్మ 'రణరంగం' ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది అనే నమ్మకముందని.అన్నారు. 'గ్యాంగ్ స్టర్' గా ఈ చిత్రం లో కథానాయకుడు శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. 'గ్యాంగ్ స్టర్' అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని  సంఘటనల సమాహారమే ఈ 'రణరంగం'.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ 'గ్యాంగ్ స్టర్' పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. నాయికలు కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిని ల పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల అయిన చిత్రం ఆడియోకు కూడా మంచి స్పందన లభించింది. ప్రేక్షకులు కూడా ఈ నూతన  'గ్యాంగ్ స్టర్'  చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  
  


మరింత సమాచారం తెలుసుకోండి: