మాస్టార్ మైండ్ మరియు స్ర్కీన్ ప్లే గాడ్ క్రిస్టఫర్ నోలన్ నిర్మించి దర్శకత్వం వహిస్తున్న చిత్రం టెనెట్. ఈమధ్యే చిత్రానికి సంబంధించిన ఫోటొలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ వెటరన్ నటి డింపుల్ కపాడియా కూడా నటిస్తుంది. ఈమె కి సంబధించిన వర్క్ లోకెషన్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. లీకయిన ఫోటో హీరో రాబిన్ పటిన్ సన్ పోలిస్ ఆఫిసర్ గా కనిపిస్తున్నాడు.
హలీవుడ్ ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం ఇన్ సెప్షన్ మూవి సీక్వల్ అని అంటున్నారు.

2010 లో వచ్చిన ఈ సినిమా కలల దొంగతనం అనే కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ సినిమా ప్రపంచ సినిమా ప్రేక్షకుల మరియు విమర్శకుల బుర్రకు పదును పేట్టింది. బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
టెనెట్ టిజర్ ని హబ్స్ అండ్ షా ప్రీమియర్ ఫోలో రహస్యంగా రీలిజ్ చేశారు. టైమ్ ఫర్ న్యూ ప్రోటాగనిస్ట్ ,టైమ్ ఫర్ న్యూ మిషన్ అంటూ మొదలన టిజర్ 50 సెకస్ల్ నిడివి ఉండి నోలన్ మార్క్ టేకింగ్ కనబడుతుంది. నోలన్ మూవిలో మొదటి సారి నల్ల జాతియుడిని


హీరోగా క్యాస్ట్ చేశారు. జాన్ డెవిడ్ వాషింగెటన్, రాబిన్ పటిన్ సన్ ,డింపుల్ కపాడియా లు ప్రధాన తారగాణంగా నటిస్తున్నారు.
ఈ సినిమాకి నోలన్, అతడి భార్యా ఎమ్మ థామస్ మరియు వార్నర్ బ్రదర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 240 మిలియన్ డాలర్లని అని గాసిప్స్ వినబడుతన్నాయి. నోలన్ చివరి చిత్రం "డన్ కిర్క్ " మంచి విజయం సాధించింది. ఆస్కార్ బైస్ట్ డైరక్టర్ విభాగంలో అవార్డ్ కొంతలో చేజారింది.కాని బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ సొంతం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: