యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన వల్ల జరగిన అపవాదు నుంచి బతికించేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులు అత్యవసర ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అన్నది ఆదివారం నుంచి బయట పడుతుంది అంటున్నారు టాలీవుడ్ లో. ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఆయన ఇమేజికి కోలుకోలేని దెబ్బ తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కొంప ముంచిందన్న టాక్ బయట వినిపించింది. దీంతో వెంటనే సినిమా మేకర్స్ ఈ లోటును తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. సెకండ్ హాఫ్ లో ఉన్న బోరింగ్ సీన్లు, అనవసరమైన సీన్లు తొలగించారు. దీని ద్వారా ప్రేక్షకుల్లో కలిగిన అయిష్టాన్ని తొలగించే ప్రయత్నం చేసారు. అంతే కాదు, ఈ సినిమాకు మరింత ఎన్టీఆర్ ఎనర్జీ కలిపారు. ఈ సినిమాలో రిలీజ్ తో యాడ్ చేయని ఒక పాటను జోడించారు. ‘ఒక్కడంటే ఒక్కడే, చిక్కడంటే చిక్కడే’ అన్న పాటను జోడించి ఆదివారం విడుదల చేయనున్నారు. ఎంతో శ్రమించి ‘రామయ్య’ కు చేసిన ఈ ఆపరేషన్ ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: