బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం రోజురోజుకి చాలా ఉత్కంఠభరితంగా మారిపోతుంది. తాజాగా మూడో వారం ఎంటర్ అయ్యాక ఇంటి కెప్టెన్ గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ లో ఇంటి సభ్యులు ఆడిన గేమ్ గొడవలకు దారి తీసింది. ఈ క్రమంలో బిగ్బాస్ ఇచ్చిన నిధిని కాపాడుకోవడానికి ఇంటి సభ్యుల ప్రయత్నాలు ఒకరిపై ఒకరు కొట్టుకునే విధంగా మారిపోయింది. దీంతో ఇంటి సభ్యుల మధ్య కొట్టుకునే వాతావరణం మొత్తం అలుముకుంది. ఆట లో భాగంగా కంటెస్టెంట్ ఆలీ మరియు హిమజ ల మధ్య వివాద ఎపిసోడ్ హైలెట్ అయింది.


గేమ్ లో భాగంగా ఇంట్లో నీళ్లు తాగినందుకు కంటెస్టెంట్ ఆలీ హిమజను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. దీంతో ఆమె నిరాకరించడంతో ఆమె జేబులో ఉన్న డబ్బులు లాక్కోవడానికి ఆలీ ప్రయత్నించడంతో హిమజ తనని తాను కాపాడుకోవడం కోసం ఆలీ మొహం పై కాలితో తన్నడం తో వెంటనే ఆలీ నన్ను తన్నుతావా..? నిన్ను కూడా కొడతా అంటూ ఆమె మీదకి వెళ్లాడు. అయితే నువ్ చేతులు పెట్టావ్ కాబట్టే నిన్ను తన్నా తప్పితే వ్యక్తిగతంగా చేయలని కాదని సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది హిమజ. కేవలం నువ్వు డబ్బులు తీసుకోవడానికి చేసిన ప్రయత్నంలో అనుకోకుండా జరిగిన ఘటన అని హిమజా ఆలీకి ఎంత చెప్పినా కానీ  ఆలీ వినకొండ వెంటనే ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ చాలా దారుణంగా హిమజా హర్ట్ అయ్యేలా విమర్శలు చేస్తున్న క్రమంలో వెంటనే హిమజా ఆలీ కాళ్లపై పడి నన్ను క్షమించమని కోరిన కానీ వెంటనే ఆలీ నా కాళ్ళపై పడి నీకు చెప్పానా అంటూ మాట్లాడటం తో హిమజా బోరున ఏడ్చేసింది.


దీంతో కంటేనే ఏంటి సభ్యురాలు తమన్నా సింహాద్రి హిమజా వైపు స్టాండ్ తీసుకొని ఆలిని విమర్శించటం మొదలు పెట్టింది. ఒక ఆడపిల్ల తో కాళ్లు పట్టుకునే లా రెచ్చిపోతున్నావ్ అంటూ తమన్నా ఎటాక్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపటికి ఆలీ వచ్చి హిమజా తో సామరస్యంగా మాట్లాడటంతో వాతావరణం సద్దుమణిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: