అక్కినేని నాగార్జున నటుడు కంటే ముందు నిర్మాత. ఏఎన్నార్ ని పెట్టి అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున పేరు మీద వరస సినిమాలు ఎర్లీ ఎయిటీస్ లో  తీశారు. అందులో చాలా వరకూ హిట్లే. ప్రేమాభిషేకమైతే రికార్డులు బద్దలుకొట్టింది. ఆ తరువాత నాగార్జున హీరోగా తెర ముందుకు వచ్చారు. అంటే నాగ్ లో నటుడు ఎంత ఉన్నాడో అంతకంటే సీనియర్ నిర్మాత అన్న మాట. నాగార్జున సొంతంగా తీసిన సినిమాలు దాదాపుగా విజయవంతమైనవే. సైలెంట్ గా రిలీజ్ చేసి కాసులు పండించుకోవడం నాగ్ ఆర్ట్.


నైన్టీస్  చివర్లో నాగ్ తీసిన నిన్నే పెళ్ళడుతా కానీ, ఆ మధ్యన మనం మూవీ కానీ మూడేళ్ళ క్రితం సోగ్గాడే చిన్న నాయన కానీ బంపర్ హిట్లు కొట్టాయి. ఇపుడు మన్మధుడు 2 మూవీని మిగిలిన పార్టనర్స్ తో కలసి నాగ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఉంది. ఇపుడు చూస్తే సినిమాలు పోటీగా ఏమీ లేవు. ఇస్మార్ట్ శంకర్ హడావుడి తగ్గింది. అయినా అది మాంచి  మాస్ మసాలా.


దానికి కాంట్రాస్ట్ గా రావాలంటే మన్మధుడు 2 సరైన మూవీ. పైగా శ్రావణ శుక్రవారం, ఆ మీదట బక్రీద్,  ఆగస్ట్ 15 హడావుడి ఇలా సెలవులు కూడా కలసి వస్తున్నాయి. మూవీ బాగుంద‌ని మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే చాలు మన్మధుడు టాప్ గేర్లోకి వెళ్ళిపోయినట్లే. సరైన టైమింగ్ చూసుకుని మరీ ఈ నెల 9న  నాగ్ మూవీని రిలీజ్ చేస్తున్నాడు.


సాహో మూవీ వచ్చేంతవరకూ నాగ్ మూవీకి ఎదురు ఉండదు. ఈ మూవీలో నాగ్ టైప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు, రకుల్ నాగ్ కెమిస్ట్రీ పెద్ద ప్లస్. అలాగే వెన్నెల కిషోర్ నాగ్ కామెడీ, సీనియర్ నటీమణి లక్ష్మి ఉండడం ఇవన్నీ మూవీకి అదనపు ఆకర్షణలే.  ఇక నాగ్ జబర్దస్త్ రియాలిటీ షో ద్వారా  జనాలకు ఇపుడు మరింత దగ్గర అయ్యాడు.


దానికి తోడు సీనియర్ హీరోలకు మళ్ళీ జనం వెల్ కమ్  చెబుతున్నారు. వెంకీ ఎఫ్ టు మూవీని బ్లాక్ బస్టర్ చేసారంటే అందులో ఎంటర్టైమెంట్ మెయిన్ రీజన్. ఇపుడు మన్మధుడు కూడా అదే రేంజి కామెడీతో ఫుల్ ప్యాక్ చేసి ఉంచారట. సో రేపు రిలీజ్ అయ్యే మన్మధుడు 2 హిట్ ఐతే నాగ్ లైఫ్ లాంగ్ మన్మధుడే మరి. అరవైలో కూడా ఆ టైటిల్ తో హిట్ కొట్టదం తమషా కాదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: