పాపారాయుడు, పెద్దరాయుడు, ఆండ్రాయిడు‌గా సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో నటిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’ . ఈ‌ నెల 10 వ తేదీన విడుదల కానుంది కాగా ఈ రోజు దాని ట్రైలర్ విడిదల చేశారు. ‘హృద‌య‌కాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు సుపరిచితమైన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో‌ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు .  ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది . ఈ కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ మారుతి విడుదల చేశారు .


 ‘హృద‌య‌కాలేయం’ సృష్టి క‌ర్త స్టీవెన్ శంక‌ర్ రాసిన క‌థ‌ , క‌థ‌నం , మాట‌లతో  ‘కొబ్బ‌రిమ‌ట్ట’   చిత్రంతో  రూప‌క్ రొనాల్డ్ స‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు . ఈ సినిమా కి  సాయి రాజేష్ నిర్మాత‌ మరియు  కమ్రన్ సంగీతం అందించారు .
 
ట్రైలర్ విషయానికి వస్తే  మాములుగా సంపూ ఒక్కడు కనిపిస్తేనే కడుపుబ్బా నవ్వొస్తుంది. అలాంటిది త్రిపాత్రాభిన‌యంలో సంపూని చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చనేది ఈ ట్రైలర్ లో స్పస్టంగా తెలుస్తోంది. "పిండి లో‌ మీ చెమట పడుతోంది అంటే రెండు చెంచాలు ఉప్పు తక్కువ వెయ్యి ఎంతైనా మనం పేదవల్లం కదా  "  అని సంఫూ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి . ఒకా నొక సంధర్భం‌లో‌  సంపూ‌ కార్ ని పైకి లేపడం చూస్తే బాహుబలి కన్నా బలశాలి గా కనిపిస్తాడు. అంతే‌కాక తన వెస్టెర్న్ మరియు క్లాసికల్ రెండు రకాల డాన్స్  పర్ఫార్మెన్స్ తో సంపూ‌ ఉర్రూతలూగించాడు .

ఎన్నో అవాంతరాల తరువాత దాదాపు రెండు సంవత్సరాల తరువత విడుదలకు నోచుకున్న  ఈ‌  సినిమా సంపూ  కెరియర్ లో ఒక నవ్వుల మైలురాయి గా నిలిచిపోవాలని కోరుకుందాం. ట్రైలర్ ఈ‌  వీడియో లో‌ చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: