ఒక పాటను ట్యూన్ చేసి బాణీలు రాసి షూట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది.. మినిమం పదిరోజుల సమయం పడుతుంది.  అందులో సందేహం అవసరం లేదు.  కొన్నిసార్లు ఇంకా ఎక్కువ రోజులు పట్టొచ్చు.  అలా కాకుండా ఒక్కరోజులో ట్యూన్, సాంగ్, షూట్ మూడు పూర్తి చేయడం సాధ్యమౌతుందా.. ఖచ్చితంగా కాదు.  ఒక్కరోజులో షూట్ చేయాలంటే చాలా కష్టం.  అది సాంగ్.  



ఇలాంటి సందేహాలకు మూగమనసులు సినిమా సమాధానం ఇస్తోంది.  అందులో ఈవేళ నాలో ఎందుకో ఆశలు అనే సాంగ్ ఉన్నది.  ఈ సాంగ్ ను షూట్ చేసిన విధానం.. దాన్ని మ్యూజిక్, బాణీలు అన్ని చాల విచిత్రంగా షూటింగ్ చేశారు.  అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాలో మొదట ఈ సాంగ్ స్థానంలో మరో సాంగ్ ఉన్నది.  దాన్ని షూటింగ్ కూడా చేశారు.  అయితే, అది ఏవిఎం నిర్మాత మెయ్యప్పన్ కు నచ్చలేదు.  సాంగ్ మాత్రమే కాదు.. సాంగ్ చిత్రీకరణ కూడా నచ్చలేదట.  వెంటనే.. హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ఈ విషయం చెప్పాడు.  



అప్పటికే నాగేశ్వర రావు పెద్ద హీరో.  వరసగా సినిమాలు చేస్తున్నాడు.  రీ షూట్ చేయడానికి నాగేశ్వర రావు కూడా ఒకే చెప్పారు.  ఈ సినిమాకు సంగీత దర్శకుడు గోవర్ధనంను పిలిచి హిందీలో తీసిన దో కలియా సినిమాలోని తుమ్హారీ నజర్ సాంగ్ ను వినిపించి.. ఇలాంటి ట్యూన్ తో సాంగ్ చేయమని అడిగారట.  ఆ ట్యూన్ తో దాశరథి వెంటనే పల్లవి, ఒక చరణం రెడీ చేసి స్టూడియోకు వెళ్లారు.  
స్టూడియోలు ఘంటసాల, సుశీల సాంగ్ ను పడుతున్నారు. 


వాళ్ళు పల్లవి, చరణం పాడేలేపు దాశరధి రెండో చరణం పూర్తి చేసి ఇచ్చారు.  మధ్యాహ్నం వరకు సాంగ్ రికార్డింగ్ పూర్తయింది.  ఆరోజు సాయంత్రం జమునను పిలిచి ఆమెపై కొన్ని షోలో షాట్స్ పూర్తిచేశారు.  ఆ మరుసటి రోజు నాగేశ్వరరావుపై మిగతా సాంగ్ షూట్ చేశారు. అలా సాంగ్ రికార్డింగ్, షూటింగ్ పూర్తయ్యాయి.  ఈరోజుకి ఈవేళ నాలో ఎందుకో ఆశలు సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.  ఎవర్ గ్రీన్ సాంగ్స్ లో ఇదికూడా ఒకటిగా ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: