శంకర్ సినిమాలంటే భారీగా ఉంటాయి.  ఒక సినిమా తీయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు.. భారీగా ఖర్చు చేస్తుంటారు.  దేశవిదేశాల్లో షూటింగ్ చేస్తూ విజువల్ ట్రీట్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఐ సినిమా తరువాత శంకర్ జోష్ తగ్గింది.  ఐ మూవీ ఫెయిల్ కావడం పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి.  దీనితరువాత చేసిన రోబో 2పాయింట్ 0 పర్వాలేదు.  అనుకున్నట్టుగా భారీ విజయం సాధించలేదు. 


టెక్నాలజీ మూవీ కావడంతో పెద్దగా ఎవరికి అర్ధం కాలేదు.  3డి సినిమా కావడం ఒక డ్రాబ్యాక్.  రోబోలో చూసిన రజినీకాంత్, ఇందులో చూసిన రజినీకాంత్ వేరుగా ఉన్నాడు.  అది పెద్దగా క్లిక్ కాలేదు. 
ఈ సినిమా తరువాత శంకర్ ఎప్పటి నుంచో అనుకున్న భారతీయుడు 2 స్టార్ట్ చేశారు.  చాలా రోజుల వరకు సినిమా ఆగిపోయింది.  కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు అనవసరం.  ఇక సినిమా ఆగిపోయినట్టే అనుకున్న సమయంలో తీపి కబురు తీసుకొచ్చారు.  సినిమా తిరిగి పట్టాలెక్కబోతున్నది.  త్వరలోనే రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.  కాజల్ హీరోయిన్ గా చేస్తున్నది.  ఈమెతో పాటు క్యాస్టింగ్ పెద్దగానే ఉన్నది.  కమల్ హాసన్ హీరో.  


ఈ సినిమాతో పాటు శంకర్ మరో సినిమాకు ప్లాన్ చేశారు.  సూర్యతో సినిమా చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.  సూర్య మూవీతో పాటు ఇండియాలో ది బిగ్గెస్ట్ మూవీ చేసేందుకు శంకర్ రెడీ అవుతున్నట్టు సమాచారం.  బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో ఓ సైంటిఫిక్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.  కథ ఇప్పటికే సిద్ధం అయినట్టు సమాచారం.  ఓ హాలీవుడ్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది తెలియాలి.  భారతీయుడు 2 సినిమాను ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇది పూర్తి కాగానే హృతిక్ ప్రాజెక్ట్ పై కూర్చుంటారని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: