హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం హిట్ కావటంతో వరుసగా సినిమాల్లో సంపూర్ణేష్ బాబుకి అవకాశాలొచ్చాయి. సింగం123 సినిమాలో హీరోగా మరి కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించాడు సంపూర్ణేష్ బాబు. కానీ ఈ సినిమాలు ఏవీ హిట్ కాకపోవటంతో సంపూర్ణేష్ బాబు మార్కెట్ తగ్గింది. సంపూ మార్కెట్ తగ్గటం వలన ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం ప్రారంభమైన కొబ్బరిమట్ట సినిమా కూడా ఆలస్యమయింది. 
 
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెద రాయుడు సినిమా మోహన్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సినిమాలో నటించారు. ఇలాంటి హిట్ సినిమాకు సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సినిమా పేరడీగా ఉండటంతో మోహన్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది. 
 
ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే డైలాగ్స్ విషయంలో హృదయ కాలేయం సినిమాను ఫాలో అయినట్లు తెలుస్తుంది. సినీ క్రిటిక్ కత్తి మహేశ్ గురించి షకీలా చెప్పిన డైలాగ్ బాగుంది. ఒక పాత్రలో సంపూర్ణేష్ బాబు ముగ్గురు భార్యలకు భర్త పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ చివర్లో సంపూర్ణేష్ బాబు సుమోను ఎత్తే సీన్ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. 
 
కొబ్బరిమట్ట సినిమా ఈ నెల 10 వ తేదీన విడుదల కాబోతుంది. ఆగష్ట్ 9వ తేదీన నాగార్జున మన్మథుడు2, అనసూయ కథనం, విశాల్ నటించిన ఆయోగ్య సినిమాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని సినిమాలు విడుదల అవుతూ ఉండటంతో కొబ్బరిమట్ట సినిమాకు థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. హృదయ కాలేయం తరువాత హిట్ లేని సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: