ఎక్కడికి ఈ పరుగు.. ఎందుకని ఈ పయనం అన్నట్టుగా.. బాలీవుడ్ స్టార్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు సడెన్ గా ఎయిర్ పోర్ట్ లో పరుగులు పెడుతూ మీడియాకు కనిపించారు.  మాములుగా ఈ జంట ప్రతి రెండు నెలకు ఒకసారి విదేశీయానాం చేస్తుంటారు.  పార్టీల పేరుతో, ట్రిప్స్ పేరుతో పరుగులు తీస్తుంటారు.  వెళ్ళేటప్పుడు ఇద్దరు ఒంటరిగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లడం.. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం షరా మాములే.  



గత కొంతకాలంగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే సంగతి బాలీవుడ్ కోడై కూస్తున్నది.  ప్రేమలో ఉన్నా... వివాహం మాత్రం చేసుకోబోమని అంటున్నారు.  అర్బాజ్ ఖాన్ తో అఫీషియల్ గా విడిపోయాక అర్జున్ కపూర్ కు దగ్గరైంది.  ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు.  రీసెంట్ గా ఈ మాన్ సూన్ లో విదేశాలకు వెళ్తూ మీడియాకు కనిపించారు.  హడావుడిగా ఎయిర్ పోర్ట్ లోకి పరుగులు తీస్తూ కనిపించారు.  ఎక్కడికి వెళ్తున్నారు.. ఏ దేశం వెళ్తున్నారు అన్నది తెలియదు.  



ఈ ఇద్దరి గురించి బాలీవుడ్లో ఎన్ని కథనాలు ఉన్నాయి.  వాటిని ఇద్దరు పెద్దగా పట్టించుకోరు.  అయితే కపూర్ ఫ్యామిలీ కూడా వీరి ప్రేమను అంగీకరించినట్టు తెలుస్తోంది.  అర్జున్ కపూర్ తన కుటుంబానికి విలువ ఇస్తూనే ప్రేమ విషయాలు చూసుకుంటున్నాడు.  శ్రీదేవి మరణం తరువాత.. ఇద్దరు జాన్వీ, ఖుషి సిస్టర్స్ తో కలిసిపోయాడు. 

వాళ్ళ సినిమా విషయాల గురించి పట్టించుకుంటున్నాడు.  అన్నగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అర్జున్.  ఒకవేళ మలైకా.. అర్జున్ వివాహం చేసుకుంటే.. కపూర్ ఫ్యామిలీ అంగీకరిస్తుందా.. చూడాలి.  మలైకా అరోరా నిత్యం సోషల్ మీడియాలో బిజీ గా ఉంటుంది.  దీంతో పాటు పలు టీవీ షోలు చేస్తున్నది.  ఫిట్నెస్ విషయంలో మేలైన అసలు రాజీపడదు.  అంత వయసు వచ్చినా ఇంకా అంతటి ఫిట్ గా ఉండటానికి అదే కారణం కావొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: