టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు తన 44వ జన్మదినాన్ని జరుపుకోనున్న సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ఊరూరా ఫ్లెక్సీలు కడుతూ, అలానే సోషల్ మీడియా వేదికల్లో ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు తెల్పుతూ అప్పుడే హడావుడి మొదలెట్టేసారు. నిన్న మహేష్ బాబు తన ఫ్యాన్స్ కోసం సొంతంగా హంబుల్ పేరుతో ఒక క్లాతింగ్ ఆన్లైన్  స్టోర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 

ఇకపోతే ఇప్పటివరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టేర్ లో అతి పెద్ద బర్త్ డే ట్వీట్స్ ట్రెండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంది. ఆయన పేరు మీద అభిమానులు 7.4 మిలియన్ల ట్వీట్స్ తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు. అయితే అంతకముందు మహేష్ ఫ్యాన్స్ 4.5 మిలియన్ల ట్వీట్స్ తో రెండవ స్థానాన్ని ఆక్రమించగా, మూడవ స్థానంలో 4.2 మిలియన్ల ట్వీట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. అయితే రేపటి మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న పవన్ ఫ్యాన్స్ పేరిట ట్రెండ్ రికార్డుని బద్దలు కొట్టి ఏకంగా 10 మిలియన్ల ట్వీట్స్ సాధిస్తామని అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అయితే అది ఒకరకంగా సాధ్యమయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు కొందరు విశ్లేషకులు. 

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల అభిమానులందరూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారని, అలానే ఒక హీరో అభిమానుల ట్వీట్స్ ట్రెండ్ ని మరొక హీరో అభిమానులు కొట్టేయడం అలవాటయిపోయిందని, కాబట్టి ఇపుడు మహేష్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డుని నెలకొల్పితే అది పవన్ మరియు ఇతర హీరోల అభిమానులకు సరికొత్త టార్గెట్ గా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే అభిమానుల మధ్య సాగుతున్న ఈ ట్వీట్స్ పోటీ ఆరోగ్యకరంగా ఉంటె బాగుంటుందని, కానీ అది వారి మధ్య గొడవలకు దారితీయకుండా చూసుకొని అందరూ కూడా ఆరోగ్యకర పోటీతో ముందుకు సాగితే బెటర్ అని వారు సూచిస్తున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: