యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత సీ క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కోలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే హీరోయిన్లుగా సోనాల్ చౌహాన్‌, విదిశ ఎంపిక‌య్యారు. 


ఈ సినిమాలో బాల‌య్య రెండు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు రూల‌ర్ టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకి ‘రాయల సింహా’ అని టైటిల్ పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. 


బాల‌య్య‌కు సింహా టైటిల్ ఎంత‌లా క‌లిసొస్తుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, సింహా, జైసింహా, ల‌క్ష్మీన‌ర‌సింహా ఇలా ఇవ‌న్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య‌ సింహా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఇంకా ఇటివంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అలాగే బాలయ్య మ‌రియు కేఎస్‌.రవికుమార్ కాంబినేష‌న్లో ఇప్పటికే జై సింహా సినిమా 2018లో విడుద‌లై కమర్షియల్‌గా హిట్ అయింది.


ఇక ఇద్ద‌రు హీరోయిన్ల‌తో పాటు న‌మిత కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తోంది. సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు, క‌థానాయ‌కుడు సినిమాల‌తో వ‌రుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య ఈ సినిమాతో హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్నాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: