టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమాపై కేవలం తెలుగు ప్రజల్లో మాత్రమే కాదు, యావత్ భారత దేశంలోని సినిమా ప్రేక్షకులందరిలోను మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో అత్యంత భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. 

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి ప్రభాస్ తో జతకడుతున్న ఈ సినిమాలో మెయిన్ విలన్స్ గా నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ నటిస్తున్నారు. ఇక జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ మరియు రెండు వీడియో ప్రోమో సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజయి విపరీతమైన వీక్షకాభిమానం సంపాదించాయి. ఇకపోతే ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని ఈనెల 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సాహో యూనిట్ కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. కొద్దిరోజులుగా ఈ సినిమాలోని విలన్స్ పాత్రల తాలూకు ఫొటోస్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చిన సాహో యూనిట్, 

ఒక్కసారిగా నేడు ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ లోని కొన్ని యాక్షన్ మరియు ఛేజింగ్ సన్నివేశాలు వీక్షకులకు మంచి థ్రిల్ ని ఇస్తాయని, అలానే సినిమా చూడాలనే ఆసక్తిని వీక్షకుల్లో ఈ ట్రైలర్ మరింతగా పెంచుతుందని నిన్నటినుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న సాహో ట్రైలర్ చూడాలని మీకు అనిపిస్తోంది కదూ..!! అయితే ఈనెల 10వ తేదీవరకు దానికోసం వేచిచూడండి మరి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: