సాధారణంగా మనుషులను పోలిన మనుషులు 7 గురు ఉంటారన్న మాట అందరికి తెలిసిందే. అయితే 7 మంది ఉంటారన్న ప్రూఫ్స్ ఎక్కడా చూసింది లేదు గాని, కవలలను చూశాము. అలాగే మనిషిని పోలిన మనిషిని ఈ మధ్య కాలంలో చూశాము. మాజీ మంత్రి చంద్రబాబు లాంటి వ్యక్తి తో పాటు, జూ.ఎన్.టి.ఆర్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఒకరి వల్ల ఇంకొకరికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అయితే కొత్తగా ఒక పేరున్న మనిషి అదే పేరున్న స్టార్ హీరోయిన్ ని భయపెడుతోంది. అవును తమన్నాను.. తమన్నా భయపెడుతోంది. అవును పైన చెప్పిన ఇద్దరూ ఒకటి కాదు.. ఇద్దరూ వేరే.. వారిలో ఒకరు మిల్కీబ్యూటీ తమన్నా అయితే మరొకరు మాత్రం ట్రాన్స్‌జెండర్ తమన్నా. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడి నారా లోకేష్‌పై మంగళగిరి నుంచి పోటీ చేసి హాట్ టాపిక్ అయ్యి.. ప్రస్తుతం బిగ్‌బాస్-3 హౌస్‌లో ఉన్న తమన్నా.

బిగ్‌బాస్ హౌస్‌లో తమన్నా పేరు మోగిపోతోంది.. ఆమెపేరు చెబితే మిగతా కంటెస్టెంట్స్ జంకుతున్నారు. ఒక్క హౌస్‌లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఈమె పేరే బాగా వినిపిస్తోంది. ఈమె పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచేస్తున్నారు. వీటిలో ఒరిజినల్ ఏదో.. ఫేక్ ఏదో.. అసలు మిల్క్ బ్యూటీ తమన్నా పేజీ ఏదో తెలుసుకోలేక నెటిజన్లు..ఫ్యాన్స్..సన్నిహితలు కనుఫ్యూజ్ అవుతున్నారట. అంతేకాదు.. ఒకర్ని పొగడబోయి మరొకర్ని తిట్టేస్తున్నారట.

దీంతో మన మిల్కీ బ్యూటి తమన్నా ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయపడుతోందట. ఎవరికో ట్యాగ్ చేయబోయి.. తమన్నాకు ట్యాగ్ చేస్తున్నారు. వీటిలో కొందరు బిగ్‌బాస్ ప్రియులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు మాత్రం ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారట. దీంతో సోషల్ మీడియా జోలికి పోవాలంటే తమన్నాకు తలనొప్పి వస్తోందట. మొత్తానికి బిగ్‌బాస్ నుంచి ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎలిమినేట్ అయ్యేవరకు మిల్క్ బ్యూటీకి ఈ కష్టాలు తప్పేలా లేవు. అసలే సెలబ్రిటీస్ మీద ఎప్పుడు ఏదోరకంగా బురదజళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడు కొందరు ఆకతాయిలు మరీ రెచ్చిపోవడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: