అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'మన్మథుడు 2'. మన్మథుడు కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే నాగ్ మీద రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వయసులో లిప్ లాక్స్ ఏంటీ..? అని..అలాగే రకుల్ హీరోయిన్ ఏంటీ అని..అప్పటి మన్మథుడు కి ఇప్పటి ఈ సినిమాకి అసలు పోలికే లేదని ఇలా చాలా మాటలే వినిపించాయి. దాంతో నాగార్జున కూడా కొన్ని అసభ్యకరమైన సీన్స్ ఉంటే తీసేయమని డైరెక్టర్ కి చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని కాంట్రవర్సీలైనప్పటికి ఫస్ట్ లుక్, ట్రైలర్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

ఆగస్టు-09న మన్మథుడు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాగ్ మీడియాతో మాట్లాడుతు సినిమా గురించి.. తన లైఫ్‌లో ఎదురైన కొన్ని సంఘటనలతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తన సినిమాల గురించి అక్కినేని మాట్లాడుతూ.. కొన్ని తప్పులు చేశానని ఒప్పుకున్నారు. తనకు సీరియస్‌గా సాగే సినిమాలు చూడటం ఇష్టం లేదని.. బాధతో కన్నీరు పెట్టుకోవడం అస్సలు నచ్చదన్నారు.  ఫన్నీగా నవ్వుకుంటూ ఉండే సినిమాలు చూసేందుకు మాత్రమే తాను ఇష్టపడతానన్నారు. అయితే 'శివ', 'అన్నమయ్య' తదితర చిత్రాల్లోని తన పాత్రలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా 'నా కెరీర్‌లో కొన్ని పాత్రల ఎంపిక విషయంలో కూడా తప్పులు  చేశాను.. వాటి నుంచి చాలా నేర్చుకున్నా' అని నాగ్ చెప్పడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

సో.. ఏదైతేనేం తప్పులు తెలుసుకుని మరోసారి రిపీట్ చేయకపోతే మంచిదే కదా అని అక్కినేని అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఒక స్టార్ హీరో, నిర్మాత అయినా కూడా ఇలా తన తప్పులు ఉన్నాయని చెప్పడం ఎంతో గొప్ప విషయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇక నాగ్ సీనియర్ నటుడు అయినప్పటికీ తనకొడుకులతో పాటు టాలీవుడ్‌లోని కుర్ర హీరోలతో అందంలోనే కాదు వరుసగా సినిమాలు చేస్తూ పోటీపడుతున్నాడు. ఏ యంగ్ హీరో సినిమా రిలీజవుతున్న కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళతో పోటీ పడి తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: