నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పోస్టర్ లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అయితే మన్మధుడు 2 లో బూతు డైలాగ్స్ ఎక్కువ అయ్యాయనికొంత మంది విమర్శిస్తున్నారు .  రొమాన్స్ స్పీన్స్ ముద్దు సీన్స్ తో ట్రైలర్ ను నింపేయడంతో యూత్ తెగ ఎగబడుతుంది. అయితే ఈ సినిమా మీద కొంత మంది విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే నాగార్జున ఈ వయసులో ఇటువంటి సినిమాలో నటించడం ఏంటని కొంత మంది పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో లిప్ కిస్ సన్నివేశాల పై నాగ్ స్పందించారు. నాగార్జున ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నట్టున్నారు. అందుకే నాగ్ చెబుతూ ముద్దు సన్నివేశాలు నాకు కొత్త కాదని ఇప్పటీకే ఇటువంటి సన్నివేశాలో నటించానని, ఇటువంటి సన్నివేశాలలో యూత్ తో పోటీ పడితే కిక్కే వేరని ఓ రేంజ్ లో  చెప్పుకొచ్చారు. 


అయితే ఈ సినిమాలోని డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ , ఈ సినిమాలో డైలాగ్స్ రాస్తున్నప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవుతాయని అస్సలు ఊహించలేదని, హీరో లేట్ మ్యారేజ్ చేసుకుంటే వచ్చే సన్నివేశాల్లో డైలాగ్స్ రాశామని అవి చాలా ఫన్నీగా , సరదాగా ఉంటాయని, ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమానని అందరి ప్రేక్షుకులను అలరిస్తుందని చెప్పారు. 


ఈ సినిమా ఫ్రీమేక్ కాదు కదా అన్న ప్రశ్నకు దీనికి నాగ్ సర్ ముందే సమాధానం చెప్పారని ... అన్నపూర్ణ టీం విలువల పరంగా ఎక్కడ తగ్గదని. కాపీ సినిమాను తెరకెక్కించే సంస్థ కాదని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మాతృక అయినా సినిమా నుంచి డబ్బులిచ్చి రైట్స్ తీసుకున్నామని ఇందులో ఇక ఎటువంటి వివాదం లేదని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇంకా మాట్లాడుతూ ఈ సినిమా అందరిని ఒక ప్రత్యేక ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: