టాలీవుడ్లో కాంట్రవర్శీలతో ఫేమస్ అయిన వారిలో శ్రీరెడ్డి ఒకరు. శ్రీరెడ్డికి సినిమాలలో కంటే వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం ఇవ్వలేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు బట్టలు విప్పి ధర్నా చేసింది శ్రీరెడ్డి. సినిమా ఇండస్ట్రీపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టీవీ ఛానెల్స్ డిబేట్లలో పాల్గొంది శ్రీరెడ్డి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని కొంతమందిపై పరోక్షంగా ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. 
 
టాలీవుడ్లో ఒక ప్రముఖ సినిమా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కొడుకు తనకు ఆఫర్లు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసాడని గతంలో చెప్పింది శ్రీ రెడ్డి. ఆ తరువాత తెలుగులో మిడిల్ రేంజ్ హీరోను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. తమిళంకు ఒక చెందిన ఒక డ్యాన్స్ మాస్టర్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తెలుగులో క్లాస్ సినిమాలు తీసే ఒక డైరెక్టర్, తమిళంకు చెందిన ఒక హీరోపై కూడా గతంలో కామెంట్లు చేసింది శ్రీ రెడ్డి. 
 
గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీ రెడ్డి ఈరోజు ఒక టాలీవుడ్ హీరోను ఉద్దేశించి కామెంట్లు చేసింది. టాలీవుడ్లో అతనొక డమ్మీ హీరో. 60 సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ అతనికి డబ్బంటే చాలా పిచ్చి. ఈ హీరోకి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి.ఈ హీరోకి కార్లంటే పిచ్చి , ఫిజిక్ లవర్ ఈ హీరో ఎవరో కనిపెట్టండి అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ఇలా పోస్ట్ చేయడంతో నెటిజన్లు తమకు ఇష్టం వచ్చిన పేర్లను కామెంట్ చేస్తున్నారు. 
 
గత కొంతకాలంగా వివాదాలకు దూరంగా ఉంటున్న శ్రీరెడ్డి మరలా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వివాదాలు సృష్టిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాకముందు శ్రీ రెడ్డి బిగ్ బాస్ షోలో పాల్గొనబోతుందని గాసిప్స్ వచ్చాయి. కానీ బిగ్ బాస్ షో సీజన్ 3లో శ్రీ రెడ్డి పాల్గొనలేదు. ఒకవేళ శ్రీ రెడ్డి బిగ్ బాస్ షోలో ఉండి ఉంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఎన్ని వివాదాలు సృష్టించేదో. 
 
 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: