మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. అందుకనే ఈ మాస్ రాజా ఎన్నో హోప్స్ పెట్టుకుని చేస్తున్న సినిమా 'డిస్కోరాజా'. ఈ సినిమా కూడా మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ పడి ఎట్టకేలకు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతున్నారు. అందుకే రవితేజ తో పాటు తన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ చాలాకాలం తరువాత కోమా నుండి తిరిగి బయటకి వచ్చే వ్యక్తి పాత్ర చేస్తున్నాడని సమాచారం. రవితేజ కోమాలోకి వెళ్ళకముందు, వచ్చిన తరువాత చాలా మార్పులు చేసుకుంటాయి. 

సాంకేతికంగా వచ్చిన మార్పులకి రవితేజ ఎలా అడ్జస్ట్‌ అయ్యాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేది 'డిస్కోరాజా' మేయిన్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే సేమ్ ఇటువంటి స్టోరీతోనే తమిళంలో జయం రవి సినిమా చేస్తున్నాడు. ఈ కథలో కూడా హీరో కోమా నుండి బయటకు వచ్చిన తరువాత అతని చుట్టూ జరిగిన మార్పులను ఎలా డీల్ చేస్తాడు? ఏవిధంగా అడ్జస్ట్‌ అయ్యాడు అనేదే సినిమా. కాకపోతే ఇది కంప్లీట్‌గా కామెడీగా ఎంటర్‌టైనర్‌గా తీసిన సినిమా అని రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమా 'కోమాలి' అని టైటిల్ తో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో జయం రవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది కాబట్టి తెలుగులోకి కూడా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అందుకు కారణం కాజల్ కి అటు తమిళంలో, ఇటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటి ఉంది కాబట్టి.

ఒకవేళ 'కోమాలి' గనక తెలుగులో రిలీజ్ అయితే 'డిస్కో రాజా' కాన్సెప్ట్‌లోని కొత్తదనం మన తెలుగు ప్రేక్షకులు ఫీలయ్యే అవకాశముండదు. పైగా డిస్కోరాజా డిసెంబర్ వరకు రిలీజ్ అయ్యో అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఈలోపే 'కోమాలి' రిలీజ్ అయితే ఆ ఎఫెక్ట్ 'డిస్కో రాజా'తో పాటు రవితేజ కెరీర్ పై కూడా పడనుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ తన నెక్స్ట్ సినిమా అయినా అన్నీ రకాలుగా హెల్ప్ అయ్యోలా చూసుకుంటాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: