నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ విన్నర్ రేసులో ఎవరెవరు ఉండొచ్చు అంటే వినిపించే ఒకరిద్దరు పేర్లలో ఆలి రెజా ఉంటాడు. అదేంటి షో స్టార్ట్ అయ్యి 15, 16 రోజులకే ఎలా విన్నర్ ను డిసైడ్ చేస్తారని అనుకోవచ్చు. గడిచిన ఈ రెండు వారాల్లోనే జరిగిన పరిస్థితులు వాటి ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. అయితే ఇప్పటివరకు తమ వాయిస్ విప్పని వాళ్లు చాలామందే ఉన్నారు.    


ఇప్పటివరకు హౌజ్ నుండి రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. మొదటి వారం హేమ ఎలిమినేట్ అవగా.. రెండో వారం జాఫర్ ఇంటి నుండి బయటకు వచ్చాడు. అయితే 3వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరుగుతున్న దొంగా, పోలీస్ ఆటలో ఆలి రెజా, హిమజ ఫైట్ బుధవారం ఎపిసోడ్ వేడెక్కించేసింది. 


హిమజకి సపోర్ట్ గా తమన్నా సింహాద్రి నిలిచి ఆలి రెజాతో గొడవకు దిగింది. హౌజ్ లో జరిగిన గొడవలకు అప్పుడప్పుడు తన వాయిస్ వినిపిస్తున్న ఆలి రెజా నిన్న జరిగిన గొడవలో తన వాయిస్ పెంచేశాడు. మొత్తానికి ఆలి తనకు కూడా విన్నర్ అయ్యే సత్తా ఉందని చూపించాడు. ముఖ్యంగా తమన్నాని ఎదురించి మాట్లాడి హౌజ్ లో హీరోగా నిలిచాడు ఆలి రెజా.  


మరోపక్క బాబా భాస్కర్ కూడా హౌజ్ లో అందరితో మంచిగా ఉంటున్నాడు. ఎలిమినేట్ అయిన జాఫర్ బాబా భాస్కరే విన్నర్ అవుతాడని అంటున్నాడు. అయితే 3వ వారం ఎలిమినేషన్ లో వితిక, పునర్నవిలు బాబా భాస్కర్ ను నామినేట్ చేశారు. ఇక హౌజ్ లో చాలా కంట్రోల్డ్ గా ఉంటూ అందరి మనసులు గెలిచాడు రవి కృష్ణ. తమన్నా ఓ రేంజ్ లో టార్గెట్ చేసినా సరే సైలెంట్ గా ఉన్నాడు రవి కృష్ణ.


ఇక మిగిలిన వారిలో శ్రీముఖి టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉండగా.. రాహుల్, వరుణ్ సందేశ్ లు కూడా మిగతా ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇస్తారనడంలో సందేహం లేదు. మహేష్ విట్టా కు ఇంకా బిగ్ బాస్ గేమ్ సరిగా అర్ధమైనట్టు అనిపించట్లేదు. అతన్ని మధ్యలోనే ఆడియెన్స్ ఎలిమినేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక హౌజ్ లో ఉన్న మిగతా కంటెస్టంట్స్ హిమజా, రోహిణిలు కూడా ఈ 100 రోజుల్లో ఎలిమినేట్ అవక తప్పదు. మరి బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు విన్నర్ ఎవరు అయ్యే అవకాశం ఉందో చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: