రాహుల్ ర‌వీంద్ర‌న్ అంద‌రికీ ఒక మంచి న‌టుడిగా బాగా తెలుసు. చి.ల‌.సౌ. చిత్రంతో అంద‌రికీ ఓ ద‌ర్శ‌కుడిగా కూడా ప‌రిచ‌య‌మ‌య్యారు. చి.ల‌.సౌ చిన్న సినిమా అయినా మంచి విజ‌యం సాధించింది.  త‌న రెండో చిత్ర‌మే పెద్ద హీరో  అయిన అక్కినేని నాగార్జున‌తో చెయ్య‌డం ఒక‌ర‌కంగా అదృష్ట‌మ‌నే భావించాలి. అక్కినేని నాగార్జున ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టించిన చిత్రం మ‌న్మ‌ధుడు-2. ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంద‌ర్భంగా రాహుల్ మాట్లాడుతూ...


ఇక‌పోతే అక్కినేని నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ జంట‌ అనేది కంటెంప‌ర‌రీగా కొంద‌రు భావిస్తున్నారు. కాని అలా ఏమీ లేదు. అలా అనుకుంటే గ‌తంలో చాలా మంది అలా న‌టించారు. ఉదాహ‌ర‌ణ‌కు బాలీవుడ్‌లో సైఫ్‌, క‌త్రినా క‌పూర్ అలాగే సొసైటీలో  కూడా చాలా మంది ఉన్నారు. కాబ‌ట్టి నాకు వీరిద్ద‌రు క‌లిసి న‌టించ‌డంలో ఎక్క‌డా కాంటెంప‌ర‌రీ క‌నిపించ‌లేదు.  ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్స్ కూడా కొంచం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అంద‌రూ భావిస్తున్నారు. క‌థ‌కు అనుగుణంగా ఏ సీన్ అయినా ఉంటుందే త‌ప్ప ప్ర‌త్యేకించి ఏమీ వాంటెడ్‌లీ పెట్ట‌లేదు.  ఇందులో ఏ ఒక్క సీన్ కూడా అస‌భ్య‌క‌రంగా ఉండ‌దు. అలా చూపించి టికెట్ అమ్మాల‌న్న ఇన్‌టెన్ష‌న్ అయితే లేదు. అలాగే ఇందులో రాసిన ప్ర‌తీ డైలాగ్ సింగిల్ మీనింగ్‌తోనే రాశాము. ఎక్క‌డా డ‌బుల్ మీనింగ్ ఉండ‌దు. కాక‌పోతే ఎందువ‌ల్ల‌నో ఫీడ్ బ్యాక్ అలా వ‌చ్చింది. ఇందులో డైలాగ్స్ అనేవి వ‌ల్గ‌ర్‌గా ఉండ‌వు నాటీగా, చీటీగా మాత్ర‌మే అనిపిస్తాయి.  మీకు కేవ‌లం మ‌నం ఆలోచించే విధానాన్ని బ‌ట్టి ఉంటుంది. ఒక డైలాగ్ మాత్రం బాగా డ‌బుల్ మీనింగ్ అన్న ఫీడ్ బ్యాక్‌వ‌చ్చింది. రావుర‌మేష్‌గారు చెప్పే డైలాగ్ పిల్ల‌ల‌కి కోచింగ్ ఇచ్చే వ‌య‌సులో నువ్వు బ్యాటింగ్‌కి దిగుతావేంటిరా అన్న డైలాగ్ బాగా డ‌బుల్ మీనింగ్ అన్నారు. బ‌ట్  ఆ ఉద్దేశం లేదు. కొన్ని నాటీ డైలాగ్స్ ఉన్నాయి బ‌ట్ ఎవ‌రూ ఇబ్బంది ప‌డేలా అయితే ఉండ‌వు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం 7 నెల‌లు ప‌ట్టింది. క‌థ‌ను ఫైన‌ల్ గా  లాక్ చెయ్య‌డం కోసం అంత టైమ్ తీసుకున్న‌.


మరింత సమాచారం తెలుసుకోండి: